బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ స్టార్ట్ అయ్యింది. ఇందులో భాగంగా సీనియర్స్ ని స్మగ్లర్స్ గా , జూనియర్స్ ని పోలీసులుగా మార్చాడు బిగ్ బాస్. మిత్రాశర్మ పోలీసులకి హెడ్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడే లివింగ్ ఏరియా ఇంకా మైయిన్ డోర్స్ రెండు చోట్లా చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. ఇక్కడ్నుంచీ సీనియర్స్ బొమ్మలని చెక్ పోస్ట్ దాటించాలి. ముందుగా జూనియర్స్ డోర్స్ ని క్లోజ్ చేశారు.
దీంతో ఇరు టీమ్స్ కి పెద్ద యుద్ధమే జరిగింది. ఆ తర్వాత అషూరెడ్డి, హమీదా, సరయు బొమ్మలని చెక్ పోస్ట్ పై నుంచీ గాల్లోకి విసిరారు. బయట ఉన్న అఖిల్ ఆ బొమ్మలని కలక్ట్ చేసి మరీ డ్రాప్ బాక్స్ లో వేసి టార్గెట్ ని ఫినిష్ చేశాడు. దీనివల్ల శ్రీరాపకకి, ఇంకా అనిల్ కి ఆ బొమ్మలు తగిలాయి. దీంతో జూనియర్స్ గేమ్ ని ఆపేసి మీ ఇష్టం ఉన్నట్లుగా ఆడుకోండి అంటూ టాస్క్ నుంచీ పక్కకి తప్పుకున్నారు.
అసలు మజా స్టార్ట్ అయ్యింది ఇక్కడే. నిజానికి డోర్స్ క్లోజ్ చేసినపుడు బిగ్ బాస్ జూనియర్స్ ని హెచ్చరించాడు. తలుపుకు మూయకూడదని వార్నింగ్ ఇచ్చాడు. కానీ, సీనియర్స్ గాల్లోకి బొమ్మలు విసిరినపుడు మాత్రం ఎలాంటి హెచ్చరికలు చేయలేదు. దీంతో ఆర్జే చైతూ, బిందూ, రవి దానిని అబ్జక్ట్ చేశారు. బిగ్ బాస్ ని ఎనౌన్స్ చేయమని కోరారు. కానీ, చివరకి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో మొదటిరౌండ్ లో స్మగ్లర్స్ గెలిచారని ఎనౌన్స్ మెంట్ వచ్చింది.
దీంతో చేసేదేమీ లేక గేమ్ కంటిన్యూ చేశారు జూనియర్స్. అసలు బిగ్ బాస్ రూల్స్ లో బొమ్మలు గాల్లోకి విసరకూడదు అని ఎక్కడా లేదు. కానీ, ముందునుంచీ ఫైయిర్ గేమ్ ఆడదామని కొన్ని రూల్స్ కెప్టెన్ తేజస్వి చెప్పినపుడు గాల్లోకి బొమ్మలు విసరద్దని పోలీస్ గ్యాంగ్ అయిన జూనియర్స్ క్లియర్ గా చెప్పారు. అయినా కూడా సీనియర్స్ వినిపించుకోకుండా గేమ్ లో స్మగ్లింగ్ చేసిన బొమ్మలని విసిరారు. ఇక్కడే పెద్ద గొడవ జరిగింది.
ఆ తర్వాత మార్నింగ్ వరకూ గేమ్ ని పాజ్ చేశాడు బిగ్ బాస్. కానీ, పోలీసులు బొమ్మలని దాచుకుని వాటిని సీజ్ చేశారు. మార్నింగ్ మళ్లీ టాస్క్ స్టార్ట్ అయినపుడు స్మగ్లింగ్ గ్యాంగ్ కి పది బొమ్మలు కలక్ట్ చేయమని బిగ్ బాస్ టార్గెట్ ఇచ్చాడు. దాంతో మళ్లీ రచ్చ స్టార్ట్ అయ్యింది. ఇదే ఊపులో హమీదా బొమ్మని గాల్లోకి విసిరింది. దీంతో పోలీసులు చెక్ పోస్ట్ దగ్గర లేకుండా బొమ్మలని కలక్ట్ చేయడంలో మునిగిపోయారు.
అదే అదనుగా చూసుకుని నటరాజ్ మాస్టర్ ఇంకా మహేష్ విట్టా ఇద్దరూ కూడా టార్గెట్ ని ఫినిష్ చేసారు. నిజానికి సీనియర్స్ బొమ్మలని గాల్లోకి విసరడం తప్పని అలా చేస్తే గేమ్ లో ఎలా ప్రొటక్ట్ చేస్తామని జూనియర్స్ వాపోయారు. కానీ, అనుకున్నది సాధించి టార్గెట్ ని ఫినిష్ చేశారు సీనియర్స్.