హీరోయిన్ స్నేహ ఇంట్లో సంద‌డే సంద‌డి.. ఫొటోలు వైర‌ల్..!

తొలివ‌ల‌పు చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన స్నేహ తెలుగులో ప‌లు చిత్రాల్లో హీరోయిన్‌గా న‌టించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత 2012లో త‌మిళ న‌టుడు ప్ర‌స‌న్నను వివాహం చేసుకుని ఇద్ద‌రు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. తొలుత 2015లో కొడుకు విహాన్‌కు జ‌న్మ‌నివ్వ‌గా, 2020లో కుమార్తె ఆద్యంత‌కు జ‌న్మ‌నిచ్చారు. స్నేహ‌. ఈ క్ర‌మంలో స్నేహ-ప్ర‌స‌న్న‌ల గారాలప‌ట్టి ఆద్యంత‌కు తొలిసారి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించే కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. చెన్నైలోని వారి స్వ‌గృహంలో జ‌రిగిన ఈ శుభకార్యానికి సంబంధించి తీసిన ఫొటొల‌ను, స్నేహ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయ‌గా.. ఆమె అభిమానుల‌ను అల‌రిస్తున్నాయి.

ఓ ఫొటోలో గుండుతో ఉన్న త‌న ఒడిలో ఉన్న‌ ముద్దుల కూతురును ముద్దాడుతున్న ఫొటో అయితే షోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ఫొటోలు చూసిన సినీ అభిమానులు అండ్ సినీ ప్ర‌ముఖులు స్నేహ‌ను ఆమె పాప‌ను ఆశీర్వ‌దిస్తున్నారు. ఇక స్నేహ సినిమాల విష‌యానికి వ‌స్తే ఆమె 2000 ఏడాదిలోనే మ‌ళ‌యాల‌,త‌మిళ్, తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌కు ప‌రిచయం అయ్యింది. ఎక్కువ‌గా తెలుగు,త‌మిళ భాష‌ల్లో న‌టించిన స్నేహ క‌న్న‌డ సినిమాల‌తో పాటు టెలివిజ‌న్ షోస్‌లో కూడా మెరిసింది. తెలుగులో తొలివ‌ల‌పు చిత్రంలో జ‌ర్నీ సార్ట్ చేసిన స్నేహ హోమ్లీ హీరియిన్‌గా పేరు సంపాదించారు. తొలుత‌ ప్రియ‌మైన నీకు చిత్రంతో మంచి గుర్తింపు గుర్తింపు తెచ్చుకున్నారు స్నేహ‌.

ఆ తరవాత వ‌రుస‌గా హనుమాన్ జంక్షన్, వెంకీ, రాధాగోపాలం, శ్రీరామదాసు, మహారథి, మధుమాసం, నీ సుఖమే నే కోరుకున్నా, పాండురంగడు చిత్రాల్లో హీరోయిన్‌గా న‌టించారు. రాధాగోపాలం చిత్రానికిగానూ ఈ బాపుబొమ్మ నంది స్పెష‌ల్ జ్యూరీ అవార్డు ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మారిన స్నేహ‌ అమరావతి, రాజన్న, ఉలవచారు బిర్యానీ, సన్నాఫ్ సత్యమూర్తి, రాజాధిరాజ‌, విన‌య విధేయ రామ చిత్రాల్లో న‌టించి మెప్పించారు. ప్ర‌స్తుతం దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా తెర‌కెక్కుతున్న త‌మిళ్ మూవీ వాన్‌లో కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. ఇక స్నేహ భ‌ర్త ప్ర‌స‌న్న కూడా ప‌లు తెలుగు చిత్రాల్లో న‌టించ‌డం విశేషం.

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus