Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

  • October 14, 2026 / 03:13 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

నటి, అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) భార్య శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala) తన వ్యక్తిగత జీవితం, ప్రేమ, వివాహం గురించి గతంలో చేసిన వ్యాఖ్యలపై తాజాగా స్పందింది. ఒకప్పుడు తాను నటుడితో ఎప్పటికీ డేటింగ్‌ చేయనని చెప్పిన ఆమె.. ఇప్పుడు ఆ మాటలను వెనక్కి తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో వివరించింది. కాలంతో పాటు మనుషుల ఆలోచనలు, అభిప్రాయాలు మారడం సహజమేనని, తన విషయంలోనూ అదే జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన పాత వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో నటులతో డేటింగ్‌ విషయంలో తాను భిన్న అభిప్రాయాలతో ఉన్నానని అంగీకరించింది. తన చుట్టూ ఉన్న పరిస్థితులు, తాను చూసిన అనుభవాల ప్రభావంతోనే అలా ఆలోచించి ఉండొచ్చని చెప్పింది. వయసు, అనుభవం పెరిగేకొద్దీ మన ఆలోచనా విధానంలో మార్పులు రావడం సహజమని చెప్పుకొచ్చింది.

Sobhita Dhulipala

ఓ దశలో ఉన్న అభిప్రాయమే జీవితాంతం కొనసాగించాల్సిన అవసరం లేదని.. కొత్త అనుభవాల నుంచి నేర్చుకుని అభిప్రాయాలను మార్చుకోవడంలో ఎలాంటి తప్పు లేదని స్పష్టంచేసింది. తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు మార్చుకోవడంపై తనకు ఎలాంటి భయం లేదని శోభిత తెలిపింది. ఒకే అభిప్రాయానికి జీవితాంతం కట్టుబడి ఉండటమే గొప్ప విషయం కాదని, పరిస్థితులను అర్థం చేసుకుని అవసరమైనప్పుడు తన ఆలోచనలను మార్చుకోవడం కూడా ఎదుగుదలలో భాగమేనని తెలిపింది. వేర్వేరు సమయాల్లో నాకు వేర్వేరు అభిప్రాయాలు ఉండటాన్ని నేను అంగీకరిస్తాను.. కొత్త అనుభవాలకు అనుగుణంగా మారడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదనే భావనను ఆమె వ్యక్తపరిచింది.

Naga chaitanya about life with Sobhita Dhulipala2

మరోవైపు ప్రేమపై తన అభిప్రాయాన్ని కూడా శోభిత (Sobhita Dhulipala) ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రేమను కేవలం రొమాంటిక్‌ రిలేషన్‌షిప్‌గా చూడటం తనకు ఇష్టం లేదని చెప్పింది. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే బంధం మాత్రమే కాదని.. మనసుల కలయిక, మనలో జరిగే ఒక స్పందన అని అభిప్రాయపడింది. అందుకే ప్రేమను ఒక నిర్దిష్ట నిర్వచనంలో బంధించలేమని, కాలంతో పాటు ప్రేమను చూసే విధానం కూడా మారుతుందని శోభిత చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.నాగచైతన్యతో వివాహం తర్వాత తన వ్యక్తిగత జీవితంపై ప్రజల్లో మరింత ఆసక్తి పెరగడంపైనా శోభిత (Sobhita Dhulipala) స్పందించింది. సెలబ్రిటీల గురించి సమాజంలో అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయని చెప్పింది. సమాజం వాతావరణంలాంటిదని.. వాతావరణం ఎలా వస్తూ పోతుంటుందో.. ప్రజల అభిప్రాయాలు కూడా అలాగే మారుతుంటాయని.. ఆ మార్పులను మన వ్యక్తిత్వంతో ముడిపెట్టుకుంటే పరిస్థితులు మారినప్పుడు మనం కూడా తికమకపడతామని చెప్పింది. ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారనే దానికంటే.. తాను ఎవరో తనకు స్పష్టంగా తెలుసుకోవడం ముఖ్యమని చెప్పింది.

Sobhita Dhulipala roped in VishwaDev Rachakonda film

శోభిత ధూళిపాళ్ల, (Sobhita Dhulipala) నాగచైతన్య (Naga Chaitanya) 2022లో డేటింగ్‌ ప్రారంభించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇద్దరూ తమ బంధాన్ని చాలా కాలం వరకు ప్రైవేట్‌గానే ఉంచారు. 2024 ఆగస్టు 8న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్‌ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో ఒకటయ్యారు. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ తమ వైవాహిక జీవితానికి సంబంధించిన కొన్ని మధురమైన క్షణాలను మాత్రమే అభిమానులతో పంచుకుంటున్నారు. చివరగా సినిమాలా విషయానికొస్తే.. శోభిత ధూళిపాళ్ల ఇటీవల క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘చీకటిలో’ చిత్రంలో కనిపించారు. ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. ప్రస్తుతం ఆమె దర్శకుడు పా.రంజిత్‌ తెరకెక్కిస్తున్న ‘వెట్టువం’ చిత్రంలో నటిస్తుంది.

8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Sobhita Dhulipala

Also Read

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

49 mins ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 hour ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

2 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

3 hours ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

17 hours ago

latest news

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

2 mins ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

21 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

1 day ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version