కన్నడలో రీమేక్ కానున్న నాగార్జున హిట్ చిత్రం..
- May 27, 2016 / 01:27 PM ISTByFilmy Focus
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ‘సోగ్గాడే చిన్ని నాయన’ ఇప్పుడు కన్నడలో రీమేక్ కానుంది. ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర ఈ రీమేక్ లో నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి అయ్యాయని..
ఉపేంద్రే ఈ చిత్రానికి దర్శకత్వబాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని శాండిల్ వుడ్ వర్గాలు అంటున్నాయి. మరో ఆసక్తి కర విషయం ఏమిటంటే.. రమ్యకృష్ణ పాత్రలో ప్రేమ నటించనుండగా, దాదాపు 17 ఏళ్ల తరువాత ఉపేంద్ర, ప్రేమ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం జులై నుంచి సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. కాగా సోగ్గాడే చిన్ని నాయన చిత్రం లో నాగార్జున ద్విపాత్రాభినయంలో నటించగా.. నాగ్ సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలు జంటగా నటించారు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














