‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం 2020 మంచి గుడ్ బై నే చెప్పిందని చెప్పాలి. కరోనా కారణంగా మూతపడిపోయిన థియేటర్లను ఈ చిత్రం తెరిపించి.. జనాలను థియేటర్లకు వచ్చేలా చేసింది. మెగా మేనల్లుడు సాయి తేజ్ ,నభా నటేష్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు సుబ్బు డైరెక్ట్ చేసాడు. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ అయితే రాలేదు.. రివ్యూలు కూడా నెగిటివ్ గానే వచ్చాయి..అయినప్పటికీ ‘ఓసారి థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలి’ అనే కోరికను మాత్రం జనాలకు క్రియేట్ చేసింది. దానినే ఈ చిత్రం క్యాష్ చేసుకుందని కూడా చెప్పొచ్చు. పోటీగా మరే సినిమా లేకపోవడంతో సోలోగానే ఈ చిత్రం సూపర్ హిట్ లిస్ట్ లోకి చేరిపోయింది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ను జనవరి 1నుండీ ఓటిటి లో ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో విడుదల చేశారు. అయినప్పటికీ ఈ చిత్రానికి థియేటర్లలో ఆదరణ తగ్గలేదు.
ఇక ఈ చిత్రం 2వారాల కలెక్షన్లను ఒకసారి గమనిస్తే :
నైజాం
4.23 cr
సీడెడ్
2.08 cr
ఉత్తరాంధ్ర
1.56 cr
ఈస్ట్
0.94 cr
వెస్ట్
0.59 cr
కృష్ణా
0.68 cr
గుంటూరు
0.96 cr
నెల్లూరు
0.52 cr
ఏపీ+తెలంగాణ
11.56 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.55 cr
ఓవర్సీస్
0.38 cr
వరల్డ్ వైడ్ టోటల్
12.49 cr
‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రానికి రూ.9.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 2 వారాలు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.12.49 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో ఇప్పటివరకూ ఈ చిత్రం 2.89 కోట్ల వరకూ లాభాలను అందించిందని చెప్పొచ్చు.ఈ చిత్రం విజయంతో సాయి తేజ్ కు హ్యాట్రిక్ దక్కినట్టు అయ్యింది. ఒకవేళ 100 శాతం ఆకుపెన్సీతో థియేటర్లు రన్ చేసుకోవచ్చు అని ప్రభుత్వం ముందుగానే పర్మిషన్ ఇచ్చి ఉంటే.. ఈ చిత్రం మరింతగా కలెక్ట్ చేసుండేదనే చెప్పాలి.