మనతో ఉండేవి కొన్నే

బాలీవుడ్ బ్యూటీ టబు హిందీలో కంటే తెలుగులోనే అనేక విజయాలను సొంతం చేసుకున్నారు. ప్రేమదేశం చిత్రంతో యువకుల హృదయరాణిగా స్థానం సంపాదించుకున్న ఈ బ్యూటీ నాగార్జునతో కలిసి నిన్నే పెళ్లాడుతా, ఆవిడా మా ఆవిడే, సిసింద్రీ వంటి విజయాలను అందుకున్నారు. అలాగే టబు చిరంజీవి, బాలకృష్ణ తదితరులతో మంచి సినిమాలు చేశారు. ఇప్పుడు ఇక్కడ అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ లో చిత్రాలను చేస్తున్నారు. ఆమె తాజాగా నటించిన “గోల్‌మాల్‌ ఎగైన్‌” రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. ఈ విజయానందంలో మీడియా ముందుకు వచ్చిన టబు.. వేదాంత ధోరణిలో మాట్లాడారు. ” ఒక పాత్రలో నటిస్తున్నప్పుడు మన ధ్యాస ఆ పాత్ర మీదే ఉండిపోతుందని చెప్పలేం. సెట్స్‌లో షూటింగ్‌ అయిపోయాక మన సొంత క్యారెక్టర్‌లోకి వచ్చేస్తాం.

ఒక్కోసారి కేవలం మనం చేసిన పాత్రే కాదు తోటి నటులతో నటించినప్పుడు ఏర్పడిన జ్ఞాపకాలు కూడా మనతో పదిలంగా ఉంటాయి. కొన్ని శాశ్వతంగా ఉండకపోవచ్చు కూడా.” అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ.. “బాలీవుడ్‌లో ‘బీవీ నెం.1’, ‘హేరా ఫెరీ’ తదితర చిత్రాల్లో నటించాను. ఈ రెండూ కామెడీ నేపథ్యంలో వచ్చినవే. దాంతో ఒకే తరహా పాత్రల్లో నటిస్తున్నానని కొత్తగా ప్రయత్నించాలని చాలా మంది దర్శకులు, అభిమానులు చెప్తుంటారు. ఏదన్నా కొత్తగా ప్రయత్నించడానికి ఇదే సరైన సమయం. అందుకే ఈ ఏడాది ‘గోల్‌మాల్‌ ఎగైన్‌’ సినిమాను ఎంపికచేసుకున్నాను.” అని వివరించారు. ఇందులో కీలక పాత్ర పోషించి మంచి మార్కులు కొట్టేశారు. తెలుగులో రీ ఎంట్రీపై ఆమె ఎటువంటి ప్రకటన చేయలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus