1980-90 లలో మన స్టార్స్ సినిమాల షూటింగ్ స్పాట్ రేర్ ఫోటో గ్యాలరీ!!

ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో మూవీ లాంచ్, షూటింగ్ స్పాట్, బిహైండ్ ది సీన్స్, మేకింగ్, వ్రాప్ అప్ అంటూ మన స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ఎన్నో అప్డేట్స్ మనకు ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ల ద్వారా ఈజీగా దొరికేస్తున్నాయి. కానీ 1990లలో ఇలాంటి సదుపాయాలు లేవు. ఇంత పరిణితి చెందలేదు కూడా..! ఒక్క ప్రెస్ మీట్ల ద్వారానే సినిమాలకు సంబంధించి ఒక ఫోటోనో, లేదా న్యూసో బయటకి వచ్చేది. అది కూడా సినిమా రిలీజ్ కు ముందో, ఆడియో రిలీజ్ ముందో మాత్రమే లభించేవి. షూటింగ్ స్పాట్ లో మన స్టార్లు ఎలా గడుపుతారు అనే విషయాలు అస్సలు తెలిసేవి కాదు. చెప్పాలంటే ఒక స్టార్ హీరో సినిమా సెట్లోకి మరో స్టార్ హీరో రావడం.. కాసేపు సరదాగా గడపడం వంటివి జరిగేవట. కానీ అలాంటి విషయాలు ఏమీ అప్పటి ప్రేక్షకులకు తెలిసేవి కావు.

అందుకనే మన సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ వారు కొన్ని సీన్స్ లేదా సాంగ్ షూట్ చేసే ముందు కొన్ని ఫోటోలు తీసేవారట.అప్పట్లో అయితే అవేమీ బయటకి రాలేదు కాబట్టి.. అప్పటి ప్రేక్షకులకు తెలిసి ఉండకపోవచ్చు. ఆ పిక్సే మనకి రేర్ గ్యాలరీ రూపంలో అందుబాటులోకి వచ్చింది. అలా 1980 నుండీ 1990 సంవత్సరాల మధ్యలో వచ్చిన కొన్ని సినిమాలకు సంబంధించి కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను అప్పటి ప్రేక్షకులతో పాటు ఇప్పటి ప్రేక్షకులు కూడా ఓ లుక్కేసెయ్యండి :

1) ‘శివ’ సెట్స్ లో మన ఆర్జీవీ గారు .. మన నాగ్ అండ్ అమల గారికి సీన్ వివరిస్తున్న పిక్.

2)నాగార్జున ‘ఆకాశ వీధిలో’ చిత్రం ప్రారంభంలో క్లాప్ కొడుతున్న మెగాస్టార్

3)’ఆదిత్య 369′ సెట్స్ లో మన బాలయ్య .. శుభలేఖ సుధాకర్, చలపతి రావు వంటి వారితో తీసుకున్న పిక్

4)’ఆదిత్య 369′ సెట్స్ లో డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు మరియు ప్రభుదేవా గారు మన బాలకృష్ణ తో సరదాగా ముచ్చటిస్తున్న ఫోటో.

5) ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సెట్స్ లో దర్శకుడు కె.రాఘవేంద్ర రావు గారితో చిరంజీవి, శ్రీదేవి.

6) ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ షూటింగ్ స్పాట్ లో చిరు, శ్రీదేవి ల ఫన్నీ పిక్

7)’బొబ్బిలి రాజా’ సెట్స్ లో దివ్య భారతి తో డ్యాన్స్ రిహార్సల్ చేస్తున్న వెంకటేష్.

8) ‘కూలీ నెంబర్ 1’ సెట్స్ లో మన వెంకీ కూల్ గా చూస్తున్న పిక్

9) ‘పోకిరి రాజా’ సినిమా షూటింగ్ లో భాగంగా ఛార్మినార్ దగ్గర ‘కొట్టండయ్యా బాబు’ సాంగ్ చిత్రీకరిస్తున్న సమయంలో వెంకీ పిక్.

10) ‘నిన్నే పెళ్ళాడట’ షూటింగ్ స్పాట్ లో డైరెక్టర్ కృష్ణ వంశీతో నాగార్జున, టబు.

11)’మహానగరంలో మాయగాడు’ సినిమా సెట్స్ లో చిరు, విజయశాంతి.. ల సందడి.

12) ‘ఆదిత్య 369’ సెట్స్ లో కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న బాలయ్య

13) ‘పోస్ట్ మాన్’ షూటింగ్ స్పాట్ లో మోహన్ బాబు, సౌందర్య ల రేర్ పిక్

14) టి.సుబ్బిరామి రెడ్డితో చిరు,వెంకీ, నాగార్జున, వెంకటేష్ ల రేర్ పిక్

15) వెంకటేష్ మొదటి చిత్రమైన ‘కలియుగ పాండవులు’ లో… ఖుష్బూ,వెంకీ ల పిక్

16)1990 లలో సిల్క్ స్మిత రేర్ పిక్

17) ‘లంకేశ్వరుడు’ సెట్స్ లో డైరెక్టర్ దాసరి తో చిరు.

18) ‘క్షణ క్షణం’ సెట్స్ లో డైరెక్టర్ రాంగోపాల్ వర్మతో వెంకీ, శ్రీదేవి.

19) అక్కినేని నాగేశ్వరావు గారితో నాగార్జున అన్-సీన్ పిక్

20) సీనియర్ ఎన్టీఆర్ తో చిరు రేర్ పిక్

21)చిరు – నాగార్జున ల రేర్ పిక్

22) బాలయ్య తో కళ్యాణ్ రామ్ రేర్ పిక్

23) ‘ఆదిత్య 369’ సెట్స్ లో బాలకృష్ణతో నాగార్జున రేర్ పిక్

24) ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రానికి సంబంధించి పవన్ కళ్యాణ్ రేర్ వాల్ పోస్టర్

25) ‘రాజకుమారుడు’ చిత్రం లాంచ్ పిక్ లో కె.రాఘవేంద్ర రావు గారితో సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, ప్రీతీ జింటా

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus