Sonakshi Sinha: థైస్ చూపించమంటూ సోనాక్షిని అడిగిన నెటిజన్!

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత నటీనటులపై అసభ్యంగా కామెంట్స్ చేయడం బాగా ఎక్కువైంది. చాలా మంది తప్పుడు పనుల కోసమే సోషల్ మీడియా వాడుతున్నారు. సినిమా తారలైతే కొందరు ఆకతాయిల కారణంగా సోషల్ మీడియాలో వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా నటి సోనాక్షి సిన్హాకు ఇలానే చేదు అనుభవమే ఎదురైంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా కూతురిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సోనాక్షి.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తరువాత కూడా పలు సినిమాల్లో ఆమె తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ‘హాలిడే’, ‘అకీరా’ వంటి సినిమాల్లో ఆమె నటనకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ భామ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో తన అభిమానులతో ముచ్చటించింది. ఈ చాట్ సెషన్ లో చాలా మంది అభిమానులు ఆమెని తన తదుపరి సినిమాలు.. ఇతర విషయాల గురించి అడిగారు. అయితే కొందరు మాత్రం కొన్ని అసభ్యకర కామెంట్స్ చేశారు.

ఓ వ్యక్తి అయితే.. బికినీ ఫోటో పోస్ట్ చేయమంటూ కామెంట్ చేశాడు. దీనిపై సోనాక్తి వెటకారంగా స్పందిస్తూ.. గూగుల్ లో ఓ బికినీ ఫోటో తీసి పోస్ట్ చేసింది. ఆ తరువాత మరో వ్యక్తి నీ థైస్ చూపించు అంటూ పోస్ట్ చేశాడు. దానికి ఆమె కుదరదంటూ బదులిచ్చింది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus