అలనాటి హీరోయిన్ సోనాలి బింద్రే జీవితంలో అతిపెద్ద సవాలును ఎదుర్కోవాల్సిన సమయం వచ్చింది. మృత్యువుతో పోరాడేందుకు సిద్ధమైంది. రీసెంట్ గా కొన్ని పరీక్షలు చేసుకోవడంతో ఆమెకు క్యాన్సర్ నాల్గవ దశలో ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆందోళనపడ్డ సోనాలి.. కుటుంబ సభ్యులు ఇచ్చిన ధైర్యంతో ట్రీట్మెంట్ కోసం న్యూ యార్క్ కి బయలు దేరింది. అక్కడి వైద్యులు వెంటనే చికిత్సని మొదలు పెట్టారు. ఇందులో భాగంగా తన జుట్టుని కత్తిరించుకుంది. ఈ కటింగ్ వ్యవహారాన్ని మొత్త వీడియో తీసి మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు కటింగ్ తర్వాత ఫోటోలను కూడా చేసింది. ఈ చిత్రాల్లో దైర్యంగా, నవ్వుతూ ఉంటూ.. చాలామందికి స్ఫూర్తిని అందించింది.
కటింగ్ చేసుకున్న తర్వాత సొనాలికి ఆమె భర్త గోల్డీ భెల్ ముద్దు పెడుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జుట్టు తగ్గిన తర్వాత సోనాలి పై భెల్ ప్రేమ మరింత పెరిగిందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అతనే పక్కనుండి సోనాలికి వైద్యంతో పాటు ధైర్యాన్ని, ప్రేమని అందిస్తున్నారు. సొనాలికి క్యాన్సర్ ఉందని తెలియగానే “కింగ్” నాగార్జున సొనాలీ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. “నువ్వు త్వరగా కోలుకోవాలని, నీ ఆత్మవిశ్వాసానికి మరింత బలం చేకూరాలని కోరుకుంటున్నా డియర్” అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. అలాగే చాలామంది సినీ ప్రముఖులు సోనాలి త్వరలో కోలుకోవాలని విష్ చేశారు.
#SonaliBendre chops off her hair to undergo cancer treatment!
A post shared by Filmy Focus (@filmyfocus) on