వైరల్ అవుతున్న సోనాలి బింద్రే కన్నీటి లేఖ

బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే హిందీలో దాదాపు 30 సినిమాలకు పైనే చేసింది.  మహేష్ బాబు మురారి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇంద్ర, మన్మధుడు వంటి సినిమాలతో  తెలుగువారి మనసులో మంచి స్థానం సంపాదించుకుంది. పెళ్లి అయిన తర్వాత బుల్లితెరకే పరిమితమైన ఈమెకి క్యాన్సర్‌తో ఉన్నట్టు కొన్ని రోజుల క్రితం తెలిసింది. అదికూడా నాల్గవ దశలో ఉన్నట్టు తెలియడంతో దైర్యంగా పోరాడుతోంది. ఆ విషయం మీడియా ద్వారా రకరకాలుగా వ్యాప్తి చెందడం ఇష్టంలేక స్వయంగా లేఖ రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌ లో రాసింది. ఈ లేఖ ఆమె అభిమానులను, నెటిజనులతో  కన్నీరు పెట్టిస్తోంది. వైరల్ అయిన ఆ లేఖలో ఏముందంటే.. ”కొన్నిసార్లు.. నువ్వు కొంచెం కూడా ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా, లైఫ్ నిన్ను ఎక్కడికో విసిరేస్తుంది.

నాకు రీసెంట్‌గా హై-గ్రేడ్ క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. అనారోగ్య కారణాలతో కొన్ని టెస్టులు చేయించుకున్న నాకు ఊహించని విధంగా క్యాన్సర్ అని తేలింది. నా కుటుంబం, నా క్లోజ్ ఫ్రెండ్స్ నా దగ్గరే ఉంటూ చాలా సపోర్ట్ ఇస్తున్నారు. వెంటనే చికిత్స చేయించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి నా డాక్టర్ల సలహాతో నేను న్యూయార్క్‌కి ట్రీట్‌మెంట్ కోసం వెళ్తున్నా. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్ట్ నాకు చాలా ఉంది. వారి సహకారంతో నేను ఈ క్యాన్సర్‌ను జయిస్తాను” అంటూ పోస్ట్ లో సోనాలి పేర్కొన్నారు. దీంతో ఆమె అభిమానులు మొదట బాధపడ్డారు.. అలాగే ఆమె ఈ పోరాటంలో గెలవాలని కోరుకుంటున్నారు. గతంలో మనీషా కొయిరాలా కూడా క్యాన్సర్ తో పోరాడి గెలిచి సినిమాల్లో నటిస్తోంది. అలాగే సోనాలి పూర్తి పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ కనిపించాలని అందరూ ఆశిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus