Sonali Bendre, Jr NTR: 18 ఏళ్ళ తరువాత.. సోనాలి బింద్రే టాలీవుడ్ రీ ఎంట్రీ

ఒకప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మురారి, ఖడ్గం, శంకర్ దాదా ఎంబిబిఎస్ ఇలా వరుస సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న సోనాలి బింద్రే హఠాత్తుగా సినిమాలకు దూరం అయ్యింది. ఇక ఆమె సడన్ గా ఎక్కడకు వెళ్లింది అనే ప్రశ్నలు అప్పట్లో చాలానే వచ్చాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ జనాలకు ఆమె కొన్ని సినిమాలతోనే చాలా దగ్గర అయిపోయింది. మన్మధుడు ఇంద్ర వంటి సినిమాలతో కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుంది.

Click Here To Watch Now

కథలపై మంచి పట్టున్న సోనాలి బింద్రే ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతుంది అనే ఒక సెంటిమెంట్ కూడా అప్పట్లో కొనసాగింది. ఇక 2004 లో శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా అనంతరం సోనాలి బింద్రే మళ్లీ తెలుగులో నటించింది లేదు. బాలీవుడ్ సినిమాల్లో కొన్నాళ్ళు నటించినప్పటికీ ఆ తర్వాత పెళ్లి అనంతరం సినిమాలకు దూరం అయింది. అయితే మళ్ళీ కొన్నాళ్ళకు సోనాలి బింద్రే క్యాన్సర్ బారిన పడడంతో న్యూ యార్క్ కి వెళ్లి అక్కడ ప్రత్యేకమైన చికిత్స కూడా తీసుకుంది.

ఆ విషయాన్ని సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. క్యాన్సర్ నుంచి బయట పడిన తర్వాత సోనాలి బింద్రే కేవలం టెలివిజన్ షో లకు మాత్రమే పరిమితం అయింది. కొన్ని రియాలిటీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ మంచి ఆదాయాన్ని అందుకుంది. అయితే మళ్ళీ 18 ఏళ్ళ అనంతరం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న పాన్ ఇండియా సినిమాలో సోనాలి బింద్రే ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

ఇటీవల దర్శకుడు కొరటాల శివ కూడా ఆమె.మేనేజర్ ను కలిసినట్లు టాక్. సోనాలి బింద్రే కూడా ఆ సినిమా చేసేందుకు ఒప్పుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు చర్చలు కొనసాగిస్తున్నారు. ఇక సినిమా రెగ్యులర్ షూట్ మొదలైన తర్వాత ఆమె క్యారెక్టర్ పై కూడా అఫీషియల్గా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus