Sonarika Wedding: ప్రియుడిని పెళ్లాడిన ‘జాదుగాడు’ బ్యూటీ.. వైరల్ అవుతున్న ఫోటోలు…!

సోనారిక…ఈ బ్యూటీ గురించి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. నాగ శౌర్య హీరోగా 2015లో వచ్చిన ‘జాదు గాడు’, మంచు విష్ణు హీరోగా వచ్చిన ‘ఈడోరకం ఆడోరకం’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన ‘స్పీడున్నోడు’ వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. 2012లో వచ్చిన హిందీ సీరియల్ ‘దేవోన్ కి దేవ్ మహాదేవ్’ లో పార్వతీదేవి పాత్రలో కనిపించి దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. అంతేకాదు ‘పృథ్వీ వల్లభ: ఇతిహాస్ భీ రహస్య భీ’, ‘దాస్తాన్ ఏ మొహబ్బతే: సలీం అనార్కలి’ వంటి సీరియల్స్ లో కూడా ఈమె నటించి మంచి పేరు సంపాదించుకుంది.

‘దేవోన్ కి దేవ్ మహాదేవ్’ సీరియల్ మన తెలుగులో కూడా డబ్ అవ్వడంతో అప్పటి నుండే ఈమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దాంతో ఈమెకు ఇక్కడ ఎక్కువ అవకాశాలు రాలేదు. అందుకే తమిళ్, హిందీ సినిమాల్లో కూడా నటించింది. కానీ అక్కడ కూడా ఈమె ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఈమె గత ఎనిమిదేళ్లుగా ప్రముఖ వ్యాపారవేత్త వికాస్ భరత్ అనే వ్యక్తి తో డేటింగ్లో ఉంది. సోనారిక, వికాస్ మే 2022లో మాల్దీవుల్లో నిశ్చితార్థం చేసుకున్నారు.

ఎంగేజ్​మెంట్ అయిన ఏడాదిన్నర తర్వాత ఈ జంట వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. తాజాగా తన (Sonarika) ప్రియుడితో హల్దీ వేడుకల్లో ఆభరణాలకు బదులుగా పూలను ధరించి గాంధర్వ కన్యలాగా దర్శనంచింది. రాజస్థాన్​‌లోని రణతంబోర్​లోని సవాయ్ మాధోపూర్​లో ఆమె ప్రియుడు వికాశ్ పరాశర్‌ సోనారిక మెడలో మూడుముళ్లు వేసి వేద‌మంత్రాల సాక్షిగా వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. ప్రస్తుతం సోనారిక పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక ఈ పెళ్లి  వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus