సోనూ సూద్‌కు రానురాను మంచితనం ఎక్కువైపోతోంది… దయాగుణం డబుల్ అయిపోతోంది… జాలి ఇంటి పేరుగా మారుతోంది.. సాయం వంటి పేరు అయిపోబోతోంది. ఇందంతా ఎందుకు చెబుతున్నాం అంటారా… ఆయన సాయాలు అలా పెరిగిపోతున్నాయి మరి. లాక్డౌన్ టైమ్‌లో వలస కార్మికులకు ఆపన్నహస్తం అందించి అందరి మనన్నలు పొందిన సోనూ.. ఆ తర్వాత కూడా ఆ గుణాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. కష్టం అంటే… ఇష్టం అంటూ ముందుకొస్తున్నాడు. తాజాగా మరోసారి తన సాయపడే గుణంతో ఆకట్టుకున్నాడు.
ప్రస్తుతం సోనూ సూద్ వరుస తెలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. సెట్స్‌లో సోనూకి సన్మానాలు కూడా జరుగుతున్నాయి. అవేవీ పట్టించుకోకుండా తనమటుకు తను సేవ, సాయం కొనసాగిస్తున్నాడు. తాజాగా ‘ఆచార్య’ సెట్లో చిత్రబృందానికి మొబైల్స్ బహూకరించాడట. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. సోనూ మొబైల్స్ అందిస్తున్నట్లు కొన్ని ఫొటోలు, ఆ మొబైల్స్‌తో కార్మికులు ఆనందంగా ఉన్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సుమారు 100 మంది పేద కార్మికులకు ఉచితంగా మొబైల్స్ అందజేశాడట సోనూ సూద్.