రియల్ హీరో సోనూసూద్ కరోనా సమయంలో చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ప్రజల దృష్టిలో రియల్ హీరోగా నిలిచిన సోనూసూద్ తన టాలెంట్ తో ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారు. ఇద్దరు చిన్నారుల జీవితాలలో సోనూసూద్ వెలుగు నింపగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. సోనూసూద్ గురించి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
బీహార్ రాష్ట్రంలోని నవాడా నగరంలోని పక్రిబరవన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమర్ పూర్ గ్రామంలో ఉన్న గుల్షన్ అనే 11 నెలల చిన్నారి పుట్టుకతోనే అంధురాలు కాగా ఆ చిన్నారి కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో చిన్నారికి ఆపరేషన్ చేయించలేకపోయింది. ఈ విషయం సోనూసూద్ దృష్టికి రావడంతో చిన్నారి చికిత్సకు అయ్యే ఖర్చును సోనూసూద్ భరించడంతో పాటు చిన్నారికి కంటిచూపు వచ్చేలా చేశారు. ఉజ్జయినికి చెందిన అధర్వ అనే బాలుడు అరుదైన వ్యాధితో బాధ పడుతుండగా ఈ విషయం తన దృష్టికి రావడంతో సోనూసూద్ ఆ చిన్నారి చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
సోనూసూద్ (Sonu Sood) మనుషుల్లో దేవుడు అని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. సామాజిక కార్యక్రమాల ద్వారా సోనూసూద్ ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. సోనూసూద్ ఫ్యాన్స్ తో కలిసి దీపావళి పండుగను జరుపుకోగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అభిమానులకు సోనూసూద్ ఆటోగ్రాఫ్ ఇవ్వడంతో పాటు సెల్ఫీలకు ఫోజులిచ్చి ప్రశంసలు అందుకున్నారు.
తన దగ్గరకు వచ్చిన అభిమానులకు స్వీట్ బాక్స్ ఇచ్చి సోనూసూద్ మంచితనాన్ని చాటుకున్నారు. కొంతమంది పేద విద్యార్థులకు సోనూసూద్ ట్యాబ్స్ కూడా ఇచ్చారు. కొంతమంది అభిమానులు తమ కష్టాలను చెబుతూ సోనూసూద్ కు అర్జీలు ఇచ్చారు. రాబోయే రోజుల్లో సోనూసూద్ కెరీర్ ను ఎలా పాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!