సోనూ సూదా.. మజాకా, గట్టి పంచ్ ఇచ్చాడు..!

ఆరడుగుల పైనే హైట్ ఉంటాడు. చూడటానికి హీరోలానే అందంగా కనిపిస్తాడు. కానీ సినిమాల్లో విలన్ గా నటించి పాపులర్ అయ్యాడు. అతనే మన సోనూ సూద్. బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు సినిమాల్లో కూడా విలన్ గా నటించి స్టార్ గా ఎదిగాడు మన సోనూ సూద్. అయితే ఇటీవల రియల్ లైఫ్ లో మాత్రం హీరో అని ప్రూవ్ చేసుకున్నాడు.లాక్ డౌన్ వల్ల ముంబైలో ఇరుక్కుపోయిన వలస కూలీలను వారి సొంత ఊర్లకు చేర్చడానికి… తన సొంత ఖర్చులతో బస్సు సదుపాయం కల్పించాడు.

తరువాత ట్రైన్ సదుపాయం కూడా కల్పించాడు. కొంతమంది మహిళా కూలీల కోసం విమానం సదుపాయం కూడా కల్పించాడు. వాళ్ళందరూ సొంత ఇళ్ళకు చేరుకోవడానికి రాజకీయ నాయకుల దగ్గర గంటలకు గంటలు వెయిట్ చేసి మరీ పర్మిషన్ తీసుకున్నాడు. అంత కష్టపడిన సోనూ సూద్ కు సోషల్ మీడియాలో నెటిజన్లు అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఓ నెటిజెన్ మాత్రం అతనికి ఓ తింగరి ప్రశ్న వేసి విసిగించాడు. ఇంతకీ ఆ నెటిజెన్ అడిగిన ప్రశ్న ఏంటి అంటే..

‘ నన్ను నా గార్ల్‌ ఫ్రెండ్‌తో కలిపి అండమాన్ నికోబార్‌లో వదిలేస్తారా’ అంటూ సోనూ సూద్ ను అడిగాడు. ‘నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. మీ ఇద్దరితో పాటు మీ ఇద్దరి కుటుంబ సభ్యులని కూడా అక్కడికి తీసుకెళ్ళి వదిలేస్తే.. మీరు అక్కడే పెళ్ళి చేసుకుని హ్యాపీగా జీవించొచ్చు కదా’ అంటూ స్ట్రాంగ్ పంచ్ ఇచ్చాడు సోనూసూద్‌.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus