ప్రతి పనిలో పోలిక అనేది ఉంటుంది. మంచికి చెడుకి మరియు ఎక్కువకి తక్కువకి తేడా తెలిచేది ఈ పోలిక వలనే. కాగా ఈ పోలిక ఇప్పుడు టాలీవుడ్ హీరోలకు పెద్ద తలనొప్పిగా మారింది. విలన్ గా అనేక చిత్రాలలో నటించిన సోనూ సూద్ కరోనా లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల పట్ల ఎంతో ఉదారత ప్రదర్శించారు. వందల బస్సులు మరియు కొన్ని ట్రైన్స్ ఏర్పాటు చేసి, రహదారుల వెంట వందల కిలోమీటర్లు నడుచుకుంటూ ఇళ్లకు వెళుతున్న వారిని వారి గమ్యస్థానాలు చేర్చారు.
కోట్లు వెచ్చించి వలస కార్మికులకు అండగా నిలిచిన సోనూ సూద్ దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాడు. దీనితో దేశంలో ఎవరికి ఏ అవసరం ఉన్నా సోను సూద్ గుర్తుకువస్తున్నారు. తాజాగా ఆంద్రప్రదేశ్ లో కూడా ఓ అరుదైన సంఘటన జరిగింది. ఓ రైతు తన ఇద్దరు కూతుళ్లతో అరక తోలుతూ వ్యవసాయం చేస్తున్న వీడియో ఆయన దృష్టికి వెళ్ళింది. దీనితో సోనూ సూద్ ఆ కుటంబానికి గంటల వ్యవధిలో ఓ కొత్త ట్రాక్టర్ కొని ఇంటికి పంపారు.
ఈ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారితీయడంతో పాటు, మన టాలీవుడ్ స్టార్ హీరోలపై విమర్శలకు కారణం అయ్యింది. వందల కోట్ల ఆస్తులు, సంపాదన ఉన్న మన టాలీవుడ్ హీరోలు పేదవారి పట్ల నెరవేరుస్తున్న బాధ్యత ఏందీ అని వారు ప్రశ్నిస్తున్నారు. సినిమాలలో విలన్ పేదలకు మంచి చేసి రియల్ హీరో అనిపించుకుంటుంటే, ఇక్కడి రీల్ హీరోలు మాత్రం స్వార్ధం కోసం ప్రాకులాడుతున్నారు అని సోషల్ మీడియా వేదికగా ఎద్దేవా చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలను నెటిజన్స్ తీవ్రంగా విమరిస్తున్నారు.
#AndhraPradesh farmer Nageshwar Rao and family hail actor Sonu Sood for his kindness say ‘In reel life, he is a villain, but in real life, he is a Hero’. #SonuSoodRealHero q
CC @SonuSood https://t.co/hbzovA1fqk pic.twitter.com/3mhNnWBvMf
— Aashish (@Ashi_IndiaToday) July 26, 2020
Most Recommended Video
పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?