Sonu Sood: సోనూ ఆ విమర్శలకు బదులివ్వవయ్యా..?

  • May 21, 2021 / 09:48 PM IST

గతేడాది మార్చి నెల నుంచి ఇప్పటివరకు పేద ప్రజలకు, కష్టాల్లో ఉన్నవారికి, వలస కార్మికులకు సోనూసూద్ చేసిన సహాయాలు అన్నీఇన్నీ కావు. ఇప్పటికీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా సోనూసూద్ తన వంతు సహాయం చేస్తూనే ఉన్నారు. సోనూసూద్ ఆపదలో ఉన్నవాళ్ల సమస్యలను తీర్చడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండటం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మించి సోనూసూద్ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఎవరేం అనుకున్నా ఆలోచించకుండా మానవత్వంతో ముందడుగులు వేస్తున్న సోనూసూద్ ను అభిమానించే వాళ్ల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతుంది.

అయితే సోనూసూద్ కొంతమంది సినీ సెలబ్రిటీలకు, రాజకీయ ప్రముఖులకు తలనొప్పిగా మారారు. సోనూసూద్ లా మీరు సాయం చేయలేరా..? అంటూ నెటిజన్లు సెలబ్రిటీలను, నేతలను ప్రశ్నిస్తున్నారు. ఫలితంగా ఆ విమర్శలను ఎదుర్కొంటున్న వారిలో కొందరు పనిగట్టుకుని సోనూసూద్ పై వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు. సోనూసూద్ కు అక్రమంగా డబ్బు వచ్చిందని కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉండే సోషల్ మీడియా పేజీలలో ప్రచారం జరుగుతోంది. అయితే సోనూసూద్ మాత్రం తనపై వ్యక్తమవుతున్న విమర్శల విషయంలో సైలెంట్ గా ఉన్నారు.

సోనూసూద్ ఎప్పటికప్పుడు విమర్శల విషయంలో స్పందించి ఆ విమర్శలకు చెక్ పెడితే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. విమర్శల విషయంలో ఘాటుగా స్పందించకపోతే సోనూసూద్ పై భవిష్యత్తులో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక పార్టీ మద్దతుదారులపై ప్రజల్లో సోనూసూద్ చేసే మంచి పనుల వల్ల వ్యతిరేకత వస్తుండటంతో ఆ పార్టీ నేతలు సోనూసూద్ ను టార్గెట్ చేస్తున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus