Sonu Sood: నిజంగానే సోనూ సూద్ ని హీరోని చేసేసారు..!

  • August 4, 2021 / 02:42 PM IST

ఎక్కువగా సినిమాల్లో విలన్ పాత్రలు చేస్తున్నప్పటికీ నిజ జీవితంలో మాత్రం సోనూ సూద్ ను హీరోగా భావిస్తున్నారు జనాలు. పాండమిక్ టైములో అతను చేసిన సేవా కార్యక్రమాలు అంత తేలికగా మర్చిపోయేవి కాదు.దీంతో స్టార్ హీరోలకంటే కూడా సోనూ ఎక్కువ ప్రజాదరణ పొందాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.మొన్నటికి మొన్న సోనూసూద్ ను ఓ హీరో కొడుతున్నాడని.. ఓ చిన్న పిల్లాడు టీవీని పగలుగొట్టిన సంగతి అందరికీగుర్తుండే ఉంటుంది.

ఇప్పుడు అంతలా సోనూసూద్ ను అభిమానిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఓ ఆడియో కంపెనీ సోనూ సూద్ ను నిజంగానే హీరోని చేసి అతనికి జోడీగా నిధి అగర్వాల్ ను సెట్ చేసింది. వివరాల్లోకి వెళితే.. ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో ప్రైవేట్ సాంగ్స్ ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోలు, హీరోయిన్లు ఈ వీడియో సాంగ్స్ లో నర్తిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్, శ్రద్ధ కపూర్, రష్మిక,హన్సిక వంటి స్టార్స్ ప్రైవేట్ సాంగ్స్ లో నర్తించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఇదే కోవలో సోను సూద్ పై కూడా ఓ ప్రైవేట్ సాంగ్ ను ప్లాన్ చేశారు ఓ ఆడియో కంపెనీ వారు. ‘సాత్ క్యా నిభావోగే’ అంటూ సాగే ఈ పాటలో సోనూ సూద్ సరసన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్ నర్తించబోతుండడం విశేషం.ఈ పాట కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus