Soundarya: సౌందర్య కాదు ‘పవిత్ర బంధం’ కి ఫస్ట్ ఛాయిస్ ఆ స్టార్ హీరోయినే..!

విక్టరీ వెంకటేష్ హీరోగా సౌందర్య హీరోయిన్ గా ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘పవిత్ర బంధం’. 1996వ సంవత్సరం.. అక్టోబర్ 17న విడుదలైన ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అయ్యింది. ‘గీత చిత్ర ఇంటర్నేషనల్’ బ్యానర్ పై సి.వెంకట్ రాజు, సి.శివరాజు లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి ఈ చిత్రానికి మాటలు అందించగా భూపతి రాజా కథని అందించారు.

ఎం.ఎం.కీరవాణి సంగీతంలో రూపొందిన ఈ చిత్రం పాటలన్నీ సూపర్ హిట్టే.గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ చిత్రంలో వెంకటేష్ తండ్రిగా చాలా అద్భుతంగా నటించి మెప్పించారు.ఎంతమంది గురించి చెప్పుకున్నా.. చెప్పుకోకపోయినా ఈ చిత్రంలో హీరోయిన్ సౌందర్య పాత్ర గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఎంతో సహజంగా, అద్భుతంగా నటించి రాధ పాత్రకి ఆమె జీవం పోశారు. అయితే ఈ సినిమాకి హీరోయిన్ గా మొదట అనుకున్నది సౌందర్య గారిని కాదట. ఓ స్టార్ హీరోయిన్ ను ముందుగా రాధ పాత్రకి అనుకున్నారట.

ఆమె మరెవరో కాదు రమ్యకృష్ణ. నిర్మాతలు రమ్యకృష్ణనే ఈ పాత్రకు అనుకున్నారట. ఆమె డేట్స్ కూడా నిర్మాతల దగ్గర ఉన్నాయి. కానీ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య.. సౌందర్యనే హీరోయిన్ గా కావాలి అని పట్టుబట్టాడట. దాంతో అయిష్టంగానే వారు సౌందర్యని ఎంపిక చేసుకున్నారు. కానీ సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యాక.. దర్శకుడి మాట వినడం చాలా ప్లస్ అయ్యిందని వారు సంతోషించినట్టు సమాచారం.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus