తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ఒకప్పుడు తెలుగు సినిమా మార్కెట్ అంటే రూ.70 కోట్ల వరకే ఉండేవి. తర్వాత రాజమౌళి దయ వల్ల రూ.100 కోట్లు , రూ.500 కోట్లు, రూ.1000 కోట్ల వరకు వెళ్ళింది. ముఖ్యంగా నార్త్ లో సౌత్ సినిమాలకి మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలకి బాగా డిమాండ్ పెరిగింది. నిఖిల్ వంటి హీరోల సినిమాలు కూడా నార్త్ లో బాగా ఆడుతున్నాయి. ఇక తమిళంలో రూపొందిన ‘పొన్నియన్ సెల్వన్’ ‘విక్రమ్’ , కన్నడలో రూపొందిన ‘కాంతార’ ‘కె.జి.ఎఫ్’ వంటి సినిమాలు హిందీలో మంచి వసూళ్లు రాబట్టాయి.
అందుకే తమ సినిమాల్లో నార్త్ బ్యాక్ డ్రాప్ ఉండేలా ఫిలిం మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే.. ఒకవేళ తెలుగులో హిట్ అయితే నార్త్ లో కూడా ఆ సినిమాని రిలీజ్ చేసుకోవచ్చు. అదృష్టం బాగుంటే సినిమా అక్కడ కూడా ఆడుతుంది అనేది వారి నమ్మకం కావచ్చు. లేటెస్ట్ గా వచ్చిన ‘భోళా శంకర్’ సినిమా చూసుకుంటే అది కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమా. అలాగే జైలర్ సంగతి చూసుకుంటే..
అందులో (Heroes) రజినీకాంత్ తీహార్ జైల్లో జైలర్ గా పనిచేసినట్టు చూపించారు. అలాగే విజయ్ దేవరకొండ నటించిన ‘ఖుషి’ లో కశ్మీర్ లొకేషన్స్ లో తీసినట్టు ఉంది. బాలకృష్ణ నటిస్తున్న ‘భగవంత్ కేసరి’ సినిమాలో కూడా నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయట. పవన్ చేస్తున్న ‘ఓజి’ సినిమాని కూడా ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. మరి నార్త్ బ్యాక్ డ్రాప్ అనే మంత్రం ఎంతవరకు పనిచేస్తుంది అనేది చూడాలి.