ఒకప్పుడు సౌత్ సినిమాలను చాలా చిన్న చూపు చూసేవారు నార్త్ జనాలు. ఇక్కడి ప్రేక్షకులకి టేస్ట్ ఉండదు అని.. స్టార్ ఇమేజ్ ఉన్న సినిమాలనే గుడ్డిగా చూసి తృప్తి పొందుతారని…, కంటెంట్ ఉన్న సినిమాలను ఎంకరేజ్ చేయడం ఎంజాయ్ చేయడం వీళ్ళకు రాదు అనే అపోహ వారిలో ఉండేది. మన సౌత్ హీరోల సినిమాలు కనుక అక్కడ డబ్ అయితే వాటిని చూడడం పక్కన పెట్టి… భయంకరంగా ట్రోల్ చేసి మరీ ఆ సినిమాలకి గౌరవం లేకుండా చేసేవారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేషనల్ స్టార్లుగా ఎదిగిన వారంటూ ఉంటే అది రజినీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవి వంటి స్టార్లు అనే చెప్పాలి.
అయితే ఆ గౌరవం వీళ్ళతోనే అంతమైపోతుందా అని కంగారు పడిన వాళ్ళు కూడా లేకపోలేదు. అలాంటి పరిస్థితుల్లో నార్త్ జనాలు సౌత్ సినిమాలను ఇష్టపడడం మొదలుపెట్టారు. అక్కడి మేకర్స్ కూడా సౌత్ సినిమాలని రీమేక్ చేస్తుండడంతో అందుబాటులో ఉన్న డబ్బింగ్ వెర్షన్లను చూడడం మొదలుపెట్టారు. అందుకే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు/ వెబ్ సిరీస్ లు మొదలయ్యాయి. ఇప్పుడు నార్త్ లో అంటే నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించుకుని సౌత్ స్థాయిని పెంచిన స్టార్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :
1) రాజమౌళి :
తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన స్టార్. ఈయన సినిమా అంటే నేషనల్ వైడ్ క్రేజ్ నెలకొంది. ‘ఆర్.ఆర్.ఆర్’ రిజల్ట్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలి. తెలుగు సినిమాల్లో నటించడానికి ఇప్పుడు సల్మాన్ ఖాన్ వంటి వాళ్ళు రెడీ అవుతున్నారు అంటే అది ఈయన వల్లనే అని చెప్పాలి
2) శంకర్ :
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ టేకింగ్ అంటే బాలీవుడ్ జనాలకి చాలా ఇష్టం. ఈయన సినిమాల్లో కనిపించే విజువల్స్ కు వాళ్ళు పెద్ద ఫ్యాన్స్. బాలీవుడ్ నటీనటులు శంకర్ సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.
3)ప్రభాస్ :
‘బాహుబలి’ (సిరీస్) తో ప్రభాస్ నేషనల్ వైడ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ‘సాహో’ కూడా అక్కడ సూపర్ హిట్ అయ్యింది. దానికి ప్రధాన కారణం అక్కడ ప్రభాస్ కు ఏర్పడిన క్రేజ్ వల్లనే అని చెప్పాలి.
4) యష్ :
‘కె.జి.ఎఫ్’ చిత్రంతో నేషనల్ స్టార్ అయిపోయాడు యష్. ఇప్పుడు ‘కె.జి.ఎఫ్2’ పై కూడా అక్కడ భారీ అంచనాలు నెలకొన్నాయి.
5) ధనుష్ :
ఇతను కూడా నేషనల్ వైడ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. హిందీ సినిమాల్లో కూడా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. హాలీవుడ్ ను సైతం వదిలిపెట్టడం లేదు.
6) అల్లు అర్జున్ :
‘పుష్ప’ తో నేషనల్ వైడ్ ఫేమస్ అయిపోయాడు బన్నీ. ఈ మూవీ బాలీవుడ్లో సూపర్ హిట్ అవ్వడంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఈ మూవీలో ‘తగ్గేదే లె’ మేనరిజం క్రికెటర్లు కూడా ఇమిటేట్ చేస్తున్నారు అంటే బన్నీ క్రేజ్ ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు.
7) రాంచరణ్ :
‘ఆర్.ఆర్.ఆర్’ లో రామరాజు పాత్ర నార్త్ జనాలకి బాగా కనెక్ట్ అయ్యింది. అప్పుడే చరణ్ కు అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
8) ఎన్టీఆర్ :
‘ఆర్.ఆర్.ఆర్’ లోని కొమరం భీమ్ పాత్రకి నేషనల్ వైడ్ మంచి గుర్తింపు లభించింది. కొమరం భీముడో పాటలో ఎన్టీఆర్ నటనకి వందకి వంద మార్కులు పడిపోయాయి. పైగా ప్రమోషన్లలో కూడా ఎన్టీఆర్ అనర్గళంగా హిందీలో మాట్లాడిన తీరుకి అతన్ని తొందరగానే ఓన్ చేసుకున్నారు.
9) సమంత :
‘ది ఫ్యామిలీ మెన్2’ ‘పుష్ప’ లోని ‘ఉ అంటావా ఉఊ అంటావా’ ఐటెం సాంగ్ తో నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యింది సమంత. అక్కడ కూడా ఈమెకు మంచి క్రేజ్ ఏర్పడింది.
10) రష్మిక మందన :
నేషనల్ క్రష్.. ఈ ఒక్క పదం చాలు కదా ఈమె క్రేజ్ గురించి చెప్పడానికి. ‘పుష్ప’ మూవీ ఈమె ఇమేజ్ ను అక్కడ మరింత పెంచిందనే చెప్పాలి. బాలీవుడ్ స్టార్లు అంతా రష్మికతో నటించాలని తహ తహ లాడుతున్నారు.
11) విజయ్ దేవరకొండ :
‘అర్జున్ రెడ్డి’ తోనే ఇతనికి నేషనల్ వైడ్ గుర్తింపు లభించింది. ఇప్పుడు ‘లైగర్’ ‘జన గణ మన’ అనే రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఇవి కనుక సక్సెస్ అయితే ఇతని ఇమేజ్ అక్కడ మరింత పెరిగే అవకాశం ఉంది.
12) రానా :
అందరికంటే ముందే నేషనల్ వైడ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు రానా. ఇతని సినిమాలకి నార్త్ లో ఉండే డిమాండ్ ఏంటన్నది అందరికీ తెలిసిందే.
13) ప్రియమణి :
మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘రావణ్’ ద్వారా ఈమె హిందీ ప్రేక్షకులకి పరిచయమైంది. కానీ ‘ది ఫ్యామిలీ మెన్’ (సిరీస్) తో ఈమె నేషనల్ వైడ్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇప్పుడు ప్రియమణి వద్దకు బాలీవుడ్ ఆఫర్లు ఎక్కువగానే వస్తున్నాయి.