సోమవారం ఎస్పీ బాలు డిశ్చార్జ్ అవుతారా?

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అభిమానులకు ఒక శుభవార్త. నాలుగు రోజుల నుండి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఎస్పీబీ తనయుడు చరణ్ ఈ రోజు ఈ విషయాన్ని తెలిపారు. నిరంతరం అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో అందిస్తున్న చికిత్స సత్ఫలితాలను ఇస్తోంది. ఈ వారాంతానికి లేదా సోమవారం ఒక గుడ్ న్యూస్ చెబుతానని ఎస్పీ చరణ్ గురువారం విడుదల చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఆయన చెప్పబోయే శుభవార్త ఎస్పీబీ డిశ్చార్జ్ గురించే అయి ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఆగస్టు మొదటివారంలో కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలు ఆసుపత్రిలో చేరారు. మొదటిరోజు ఆయనే స్వయంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. ఆ వీడియోలో ఆరోగ్యంగా కనిపించిన ఆయన ఆరోగ్యం కొన్ని రోజులకు విషమించింది. దాంతో అభిమానులు ఆందోళన చెందారు. అభిమానులు సహా సినీ ప్రముఖులు సైతం ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus