వి బి ఎంటర్టైన్మెంట్స్ ఫిల్మ్ & టివి డైరెక్టరీ సీతారామశాస్త్రికి అంకితం!!

ప్రఖ్యాత గీత రచయిత సిరివెన్నెల సీతరామశాస్త్రికి మా “సమాచారదర్శిని”ని అంకితం చేయడం గర్వంగా ఉందన్నారు విష్ణు బొప్పన. వి.బి.ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ & టివి డైరెక్టరీని హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఆవిష్కరించారు.

ఈ వేడుకలో సీతారామశాస్త్రి తనయుడు, వర్ధమాన సంగీత దర్శకుడు యోగేశ్వర శర్మ, తెలంగాణ బిసి కమిషన్ చైర్మన్ డా: వకులాభరణం కృష్ణమోహన్ రావు, ప్రముఖ నటుడు-దర్శకుడు – తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్, ప్రముఖ నటీనటులు దివ్యవాణి, కృష్ణుడు, మాదాల రవి, కరాటే కళ్యాణి, కోట శంకర్ రావు, గౌతమ్ రాజు, అశోక్ కుమార్, ఈస్టర్, టివి ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వినోద్ బాల, ఎ.వి.గ్రూప్ అధినేత జి.ఎల్.విజయకుమార్, విజన్ వివికె అధినేత వి.విజయ్ కుమార్ తదితరులు పాల్గొని… విష్ణు బొప్పన కార్యదక్షతను కొనియాడారు. ఈ సందర్భంగా డిసెంబర్ 4న నిర్వహించనున్న వి.బి.ఎంటర్టైన్మెంట్స్ బుల్లితెర అవార్డ్స్ కర్టెన్ రైజర్ ఆవిష్కరించారు.

తనపై నమ్మకం ఉంచి… తనకు ఎంతగానో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ విష్ణు బొప్పన పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. డిసెంబర్ 4 న నిర్వహిస్తున్న బుల్లి తెర అవార్డ్స్ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని ఆయన కోరారు. డైరెక్టరీ ఆవిష్కరణకు ముందు పలువురు గాయనీగాయకులు సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారి విశేష ప్రజాదరణ పొందిన పలు గీతాలు ఆలపించారు. ఆల్ రౌండర్ రవి మిమిక్రీ చేయగా, స్నేహ వ్యాఖ్యాతగా వ్యహరించారు!!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus