LEO Movie: ‘లియో’లో ఆ స్పెషల్‌ క్యారెక్టర్‌ ఎవరు? క్లారిటీ ఆ రోజేనా?

  • October 9, 2023 / 05:45 PM IST

‘లియో’ సినిమా మొదలై కొన్ని రోజులు గడిచిందో లేదో ఓ పుకారు మొదలైంది. ‘ఈ సినిమాలో మరో స్టార్‌ హీరో ఉన్నాడు’ అని. ఆ మాట ఎలా బయటకు వచ్చింది, ఎవరు చెప్పారు అనేది తెలియదు కానీ… మాట అయితే బలంగా వినిపించింది. దీనిపై ఎవరి వెర్షన్‌ వాళ్లు ఇన్నాళ్లుగా చెబుతూనే ఉన్నారు. ఎవరు ఆ హీరో అంటూ సగటు సినిమా అభిమాని ఊహించుకోవడం మొదలుపెడితే… మా హీరో అయితే బాగుండు అని ఆ హీరోల అభిమానులు అనుకోవడం ప్రారంభించారు.

ఈ క్రమంలో దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌ ఎలా ఊహిస్తున్నారు, ఏం చేసుంటారు అంటూ అనాలసిసే నడిచింది. సరిగ్గా ఈ సమయంలో విజయ్‌ – లోకేశ్‌ను రామ్‌చరణ్‌ కలిశాడు అనే మాట ఒకటి బయటకు వచ్చింది. దీంతో ‘లియో’లో రామ్‌ చరణ్‌ ఉన్నాడు అంటూ ఓ టాక్‌ను బయటకు వదిలారు. దాని తర్వాత కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’లో రోలెక్స్‌ లాగా ‘లియో’లో రామ్‌చరణ్‌ అంటూ పుకారుకు కాస్త మసాల దట్టించారు. కానీ అదేమీ లేదంటూ చరణ్‌ టీమ్‌ పుకార్లపై నీళ్లు కుమ్మరించింది.

కానీ ఇటీవల లోకేశ్‌ కనగరాజ్‌ ఇచ్చిన ఓ చిన్న లీక్‌ మళ్లీ చరణ్‌ ఫ్యాన్స్‌లు ఆశలు నింపింది. (LEO Movie) ‘లియో’లో ఓ స్పెషల్ పాత్ర ఉంటుంది.. సినిమాలో మీరు ఆ పాత్రను చూశాక వావ్‌ అంటారు అంటూ చెప్పుకొచ్చారు. దీంతో లోకేశ్‌ చెప్పిన ఆ పాత్ర కచ్చితంగా చరణే అంటూ క్లారిటీ ఇస్తున్నారు ఫ్యాన్స్‌. కానీ ఇప్పటికీ చరణ్‌ సన్నిహిత వర్గాలు ‘ఆ అవకాశమే లేదు.. చరణ్‌ నటించలేదు’ అని అంటున్నాయి. కానీ ఎక్కడో చిన్న ఆశ అయితే ఫ్యాన్స్‌లో ఉంది.

విజయ్‌ హీరోగా రూపొందిన ఈ సినిమా దసరా కానుకగా ఈ నెల 20న సినిమాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ట్రైలర్‌ అంత ఆసక్తికరంగా లేకపోయినా… సినిమాలో ఏదో తెలియని పవర్‌ ఉంది అని అంటున్నారు విజయ్‌ ఫ్యాన్స్‌. చూద్దాం ఏమవుతుందో? ఎవరుంటారో?

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus