జనతా గ్యారేజ్ ఆడియో ప్రత్యేక అతిది?

సహజంగా ప్రతీ సినిమా హీరోకి అందులోనూ పెద్ద హీరోలకి వారి ఫ్యాన్ బేస్ వారికి ఉంటుంది. అయితే కొందరు కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తూ అందరినీ కలుపుకుని పోతూ ఉంటారు. ఇక అలా అందరి హీరోలతో కలిసి ముందుకు వెళ్ళడం అనేది నందమూరి వశం నుంచి వచ్చిన హీరోలకే సాధ్యం. విషయం ఏమిటంటే….ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది ఎన్టీఆర్ నైజం. అందులో భాగంగానే తాను తన బాద్‌షా సినిమా క్ల్యాప్ కొట్టడానికి మెగా ఫ్యామిలీ హీరో రామ్‌చరణ్  నే పిలిచాడు. ఇక అదే క్రమంలో ఆ సినిమాలో వాయిస్ ఓవర్ ప్రిన్స్ మహేష్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు జనతా గ్యారేజ్ విషయంలో సైతం ఎన్టీఆర్ సరికొత్త నిర్ణయానికి తెర తీశాడు. తాజా సమాచారం ప్రకారం… జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ కు మహేష్ బాబు ప్రత్యేక అతిథిగా వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే జనతా గ్యారేజ్ సినిమాకు మహేష్ వాయిస్ ఓవర్ అందించాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే అందరినీ కలుపుకుని పోయే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ ఈ ఇన్వైట్ చేసాడని తెలుస్తుంది. అంతేకాకుండా, గతంలో మహేష్ కు శ్రీమంతుడు పేరుతో సూపర్ హిట్ ఇచ్చాడు కొరటాల. త్వరలోనే మహేష్ తో మరో సినిమా కూడా చేయబోతున్నాడు. ఇక ఆ రకంగా కూడా మహేష్ ఈ ఆడియోకి తప్పకుండా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ విషయంలో నిజం ఎంతవరకూ ఉందో తెలీదు కానీ…మొత్తానికి ఈ నెల 12న ఎన్టీఆర్, ప్రిన్స్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus