శివరాత్రి నాడు బాహుబలి స్పెషల్ షో
- February 23, 2017 / 06:03 AM ISTByFilmy Focus
ప్రభాస్ కుటుంబానికి ఇష్టదైవం ఆది దేవుడు శివుడు. అలనాడు రెబల్ స్టార్ కృష్ణం రాజు భక్తకన్నప్ప గా తన కన్ను తీసి శివలింగానికి పెట్టినప్పుడు ప్రేక్షకులు భక్తులుగా మారి తమ కళ్ల నుంచి కన్నీటి చుక్కులు రాల్చారు. ఈనాడు ప్రభాస్ శివలింగాన్ని భుజంపై మోస్తుంటే ఆశ్చర్యపోయి కళ్లప్పగించి చూసారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన అద్భుత కళాఖండం ‘బాహుబలి : ది బిగినింగ్’ లో శివయ్యకి ఘడియ ఘడియకి తలస్నానం చేయించే సన్నివేశం అద్భుతహా అనిపిస్తుంది. శివుడు పేరు పెట్టుకొని ప్రభాస్ చేసిన నటన జేజేలు అందుకుంది. అటువంటి చిత్రాన్ని శివరాత్రి నాడు చూడాలని ఎవరికీ ఉండదు.
అందుకే రేపు (ఫిబ్రవరి 24న) మహాశివరాత్రి సందర్భం గా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య 70 ఎంఎం థియేటర్లో ‘బాహుబలి – ది బిగినింగ్’ సెకండ్ షోను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ విషయం తెలిసిన బాహుబలి, ప్రభాస్ ఫ్యాన్స్ టికెట్లు కొనుగోలు చేశారు. ఈ షోకు సంబంధించిన టికెట్లు ఇప్పటికే దాదాపు మొత్తం అమ్ముడుపోయినట్లు సమాచారం. తెలుగు వారి ప్రతిభను ప్రపంచానికి చాటిన బాహుబలిని ఎన్నిసార్లు చూసినా తనివితీరదు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















