ఆవిరైపోయిన ఆంధ్రుల ఆశలకు ఊపిరి పోయాలన్నా…అమరావతి కలల సౌదాన్ని కళ్ళ ముందు సాక్షాత్కరించాలన్నా…రాయలేలిన రాయలసీమ గుండెలపై కృష్ణమ్మ పరవళ్ళతో నాట్యం చేయించాలన్నా…అభివృద్దికి అర్ధం చెప్పే తన పాలనతో రాష్ట్రాని విజయపధంలో నడిపించాలన్నా… ఆరు పదులు దాటిన అలుపెరగని సైనికుడు…అభివృద్ధికి పాటుపడే నిత్య కర్షకుడు…నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ శ్రామికుడు…అయినటువంటి నారా చంద్ర బాబు నాయుడు గారికే సాధ్యం.
ఒకటా రెండా, దాదాపుగా 44ఏళ్ల ప్రొఫెషనల్ పొలిటికల్ కెరీర్….38 ఏళ్లుగా మెంబెర్ అఫ్ లెజిస్లేచర్ అసెంబ్లీ (ఎమెల్యే)…. 12 ఏళ్ల చీఫ్ మినిస్టర్…11 ఏళ్ల స్టేట్ కాబినెట్ మినిస్టర్…10 ఏళ్ల అపొసిషన్ లీడర్ గా అనుభవం కలిగిన ఏకైక వ్యక్తి చంద్ర బాబు నాయుడు. మరి రాష్ట్రానికి దిక్సూచి అయినటువంటి ఆయన గురించి కొన్ని ఆసక్తి విషయాలు చూద్దాం రండి.
1950లో నారావారి పల్లెలో జన్మించిన బాబు 1972లో ఎమ్.ఏ ఎకనామిక్స్ లో బీఏ పట్టా పొందారు..
నాదెండ్ల భాస్కర్ గారు ప్రవేశ పెట్టిన అవిశ్వాసం నుంచి ఎన్టీఆర్ ను మళ్లీ గద్డెనెక్కించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఈ ఘటనతో తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రెటరీ గా ప్రమోషన్ పొందారు.