తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక సక్సస్ రేట్ కలిగిన హీరో నాని. ఆయన సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ అన్న పేరు దక్కించుకున్నారు. పక్కింటి కుర్రోడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎటువంటి సినీ నేపథ్యం లేకపోయినప్పటికీ నేచురల్ స్టార్ గా ఎదిగారు. ఈ పేరు రావడానికి గల కారణాలపై ఫోకస్..
సహజమైన చిరునవ్వు తానొక స్టార్ అనే భావనను నాని సినిమాలో నే కాదు.. రియల్ లైఫ్ లోను రానివ్వరు. ప్రతిఒక్కరితో స్నేహ పూర్వకంగా ఉంటారు. అతను వేరొకరిపై కామెంట్స్ చేయరు. ఎదుటువారు విమర్శించే దూరం వెళ్లరు. మనస్ఫూర్తిగా నవ్వుతూ అందరితో కలిసిపోతుంటారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎలా ఉంటారో.. షూటింగ్ స్పాట్ లో ఉన్న టెక్నీషియన్లు, ఆర్టిస్టులతోను అంతే హ్యాపీగా ఉంటారు. ఇదే నేచురల్ స్టార్ అనే పదం ఆయన పేరు ముందు రావడానికి మొదటి కారణం.
వినయం“ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి..” అనే మంచి విషయాన్నీ గొప్ప దర్శకుడు బాపు వద్ద సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడే నాని ఒంట పట్టించుకున్నారు. క్లాప్ కొట్టే సమయంలో పెద్దలంటే ఎంత వినయంగా ఉన్నారో స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. అందుకు ఉదాహరణ ఈగ సినిమా చేయడం. ఇందులో పదిహేను నిముషాలు పాటే కనిపిస్తానని తెలిసినా మంచి అవకాశాన్ని విజయ గర్వం తో వదులుకోలేదు. అలాగే నూతన కథానాయకుడు విజయ్ దేవరకొండ అడగగానే పెళ్లిచూపులు ట్రైలర్ ని రిలీజ్ చేసి ఫ్రెండ్లీ నేచర్ ని చాటుకున్నారు.
విభిన్నమైన క్యారెక్టర్స్ఇమేజ్ చట్రంలో ఇరుక్కుంటే ఒకే రకమైన పాత్రలు చేయాల్సి వస్తుందని అసిస్టెంట్ డైరక్టర్ గా ఉన్నప్పుడే నాని గ్రహించారు. అందుకే అతను నటుడిగా అడుగుపెట్టినప్పుడు ఆ తప్పు చేయలేదు. కొన్నిసార్లు అపజయాలు పలకరించినప్పకిటికీ విభిన్నమైన క్యారెక్టర్స్ ఎన్నుకోవడం వదులుకోలేదు.
స్పెషల్ స్టోరీస్నానికి నేటి ప్రేక్షుకుల అభిరుచి తెలుసు. థియేటర్ కి వస్తే కాసేపు రిలాక్స్ అవ్వాలి. అతను కూడా అదే విధంగా ఆలోచించారు. అటువంటి కథలనే ఎంచుకున్నారు. అష్టాచెమ్మా దగ్గర నుంచి నేను లోకల్ వరకు అతని సినిమాలను గమనిస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది.
పాత్రలో ఇమిడి పోవడంమంచి కథ, చక్కని పాత్రను సెలక్ట్ చేసుకున్న మాత్రాన నానికి నేచురల్ స్టార్ అనే బిరుదు దక్కలేదు. ఆ పాత్రకు తగినట్లు, నిజ జీవితంలో అటువంటి సన్నివేశంలో మనం ఎలా ప్రవర్తిస్తాం? ఎలా రియాక్షన్ ఇస్తాం.. అన్నట్టుగానే నాని నటిస్తారు. అంతేకాదు మేలో డ్రామాలు, ఓవర్ యాక్షన్స్ జోలికి వెళ్లకుండా నేచురల్ స్టార్ కిరీటం దక్కించుకున్నారు.