‘చిరు 152’ లో ఆ ఎపిసోడ్స్ ఉండవా?

‘సైరా నరసింహారెడ్డి’ వేడి ఇంతా తగ్గకుండానే.. తన 152 వ చిత్రాన్ని మొదలు పెట్టేసారు మెగాస్టార్ చిరంజీవి. అపజయమెరుగని దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. ఇదిలా ఉండగా అసలు ఈ చిత్రంలో ఉండే ఎలిమెంట్స్ ఏమిటి.. ఉండని ఎలిమెంట్స్ ఏమిటి అనేదాని పై అప్పుడే ఓ అంచనాకి వచ్చేసారు ఫిలిం విశ్లేషకులు. వారు అంచనాల ప్రకారం కొరటాల- మెగాస్టార్… ప్రాజెక్ట్ లో ఉండేవి, ఉండనివి ఏంటో చూద్దాం.

కొరటాల సినిమాలో హీరో ఎలివేషన్స్ ఓ రేంజ్లో ఉంటాయి.. చిరంజీవి కూడా వాటికి అడ్డుచెప్పరు అనేది తెలిసిందే. సో ఎలేవేషన్స్ విషయంలో ఏమాత్రం లోటు ఉండదు. ఇక కొరటాల సినిమాలో ఓ సోషల్ మెసేజ్ ఉంటుంది. కాబట్టి ఈ చిత్రంలో కచ్చితంగా ఓ సోషల్ మెసేజ్ ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇకపోతే కామెడీ. కొరటాల మొదటి చిత్రం ‘మిర్చి’ పక్కన పెడితే మరే చిత్రంలోనే కామెడీకి అంతగా స్కోప్ ఉండదు. కాబట్టి ఈ చిత్రంలో కామెడీ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక రొమాంటిక్ ట్రాక్ కూడా ఉండే అవకాశం లేదు. మొత్తంగా హీరోని సబ్జెక్టు లో ఇరికిస్తూనే అభిమానులకి కావాల్సిన మాస్ ఎలివేషన్స్ తో మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ ఇవ్వడంలో కొరటాల దిట్ట కాబట్టి ఓ బ్లాక్ బస్టర్ ఆశించవచ్చు.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus