నిఖిల్ హీరోగా నటించిన తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘స్పై’. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా మారుతూ చేసిన ఈ మూవీ జూన్ 29 న విడుదల కాబోతుంది. చరణ్ తేజ్ ఉప్ప లపాటి సీఈఓగా ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై కె రాజ శేఖర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించగా… టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ రావడం..
అలాగే ‘కార్తికేయ 2 ‘ తర్వాత నిఖిల్ నుండి రాబోతున్న పాన్ ఇండియా సినిమా కావడంతో ‘స్పై’ పై అంచనాలు పెరిగాయి. దీంతో ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ కూడా చాలా బాగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 4.80 cr |
సీడెడ్ | 1.80 cr |
ఉత్తరాంధ్ర | 1.20 cr |
ఈస్ట్ | 0.88 cr |
వెస్ట్ | 0.75 cr |
గుంటూరు | 0.93 cr |
కృష్ణా | 0.90 cr |
నెల్లూరు | 0.45 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 11.71 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.64 cr |
మిగతా భాషల్లో | 1.80 cr |
ఓవర్సీస్ | 1.80 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 15.95 cr (షేర్) |
‘స్పై’ (SPY Movie) చిత్రానికి రూ.15.95 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.16.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.. బక్రీద్ హాలిడే అడ్వాంటేజ్ కూడా ఉంది.సో ఓపెనింగ్స్ భారీగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ‘స్పై’ మూవీ వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!