అత్యధిక స్క్రీన్ లలో రిలీజ్ కానున్న స్పైడర్!

  • September 12, 2017 / 01:38 PM IST

కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న “స్పైడర్” పై భారీ క్రేజ్ నెలకొని ఉంది. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమైన ఈ సినిమా మనదేశంలోనే కాకుండా అమెరికాలోని వారు కూడా ఈ సినిమాని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకు తగినట్టుగానే అక్కడి డిస్టిబ్యూటర్స్ అయిన అట్మాస్ ఎంటర్టైన్మెంట్ వాళ్లు అత్యధిక స్క్రీన్ లలో స్పైడర్ ని రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

800 వందల స్క్రీన్స్ ని లాక్ చేసినట్లు ఆ సంస్థ అధికారిక ప్రకటన చేసింది. బాహుబలి కంక్లూజన్ అమెరికాలో వెయ్యి స్క్రీన్ లలో రిలీజ్ అయింది. ఆ తర్వాత అత్యధిక స్క్రీన్ లలో రిలీజ్ కాబోతున్న మూవీ స్పైడర్ కావడం విశేషం. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై  ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈనెల 27 న రిలీజ్ కానుంది. అమెరికాలో 26 వ తేదీ సాయంత్రమే ప్రీమియర్ షోస్ వేయనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus