పుట్టినరోజున అభిమానులకు కానుక ఇవ్వనున్న మహేష్ బాబు
- April 27, 2017 / 06:07 AM ISTByFilmy Focus
మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్ మోషన్ పోస్టర్ ఏప్రిల్ 12న రిలీజ్ అయి అత్యధిక వ్యూస్ రాబట్టి రికార్డ్ సృష్టించింది. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్, విలన్ గా ఎస్.జె.సూర్య నటిస్తున్న ఈ మూవీ జూన్ 23 న థియేటర్లోకి రానుందని డైరక్టర్ రెండు నెలల క్రితమే చెప్పారు. కానీ ముందు అనుకున్న క్లైమాక్స్ ని పూర్తిగా మార్చడం వల్ల రిలీజ్ డేట్ ని వాయిదా వేశారు.
ఆగస్టు తొమ్మిదిన రిలీజ్ చేయాలనీ తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇన్ని రోజులుగా వేచి చూస్తున్న అభిమానులకు తన పుట్టిన రోజు కానుకగా ఈ సూపర్ హిట్ మూవీని అందించాలని మహేష్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ విషయాన్నీ త్వరలోనే చిత్రబృందం అధికారికంగా వెల్లడించనుంది. ఇక ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ మూవీ టీజర్ లండన్లో రెడీ అవుతోంది. ఆ టీజర్ వచ్చే నెలలో హంగామా సృష్టించనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















