రికార్డు సృష్టించిన స్పైడర్ ప్రీ రిలీజ్ బిజినెస్

  • July 27, 2017 / 10:14 AM IST

కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘స్పైడర్’ సినిమా ఒక పాట  మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల మొదటి తేదీ నుంచి  స్పైడర్ లో మిగిలిఉన్న పాట చిత్రీకరణ మొదలు పెట్టనున్నారు. యూరప్ లోని అందమైన లొకేషన్లో మహేష్, రకుల్ పై డ్యూయెట్ తెరకెక్కించనున్నారు. దీంతో స్పైడర్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అంతకంటే ముందే సినిమా బిజినెస్ పూర్తి అయినట్లు తెలిసింది. తెలుగు థియేటర్ రైట్స్ వందకోట్లకు అమ్ముడు పోయినట్లు సమాచారం. ఇక తమిళ వెర్షన్ 25 కోట్లు, హిందీ, మలయాళం కలిపి 25 కోట్లు, శాటిలైట్ రైట్స్ అన్ని భాషలు కలుపుకొని 26 కోట్లకు అమ్ముడుపోయినట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు.

ఆడియోతో పాటు మిగిలిన అన్ని రైట్స్ 24 కోట్లకు పైనే విలువ చేస్తుందని, దీంతో స్పైడర్ ప్రీ రిలీజ్ బిజినెస్ 200 కోట్లకు చేరుకొని రికార్డు సృష్టించిందని ట్రేడ్ వర్గాల వారు తెలిపారు. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై  ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న స్పైడర్ మూవీ సెప్టెంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus