మహేష్ స్పైడర్ షూటింగ్ ఇంకా మిగిలే ఉంది
- June 19, 2017 / 01:08 PM ISTByFilmy Focus
మురుగదాస్ డైరెక్షన్లో చేస్తున్న ‘స్పైడర్’ సినిమా షూటింగ్ గత శనివారంతో సూపర్ స్టార్ మహేష్ బాబు కంప్లీట్ చేసారని వార్తలు వచ్చాయి. ఆదివారం రెస్ట్ తీసుకొని సోమవారం మహేష్ నెక్ట్ సినిమా షూటింగ్ లోకి అడుగుపెట్టనున్నట్లు తెలిపారు. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారన్నది నిజమే కానీ.. స్పైడర్ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదంట. టాకీ పార్ట్ కంప్లీట్ అయినప్పటికీ ఇంకా రెండు పాటలు మిగిలే ఉన్నాయని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఆ పాటలను వచ్చే నెలా తెరకెక్కించనున్నారు. అప్పటి లోపున భరత్ అను నేను అనే సినిమాకి కొన్ని సీన్స్ మహేష్ కంప్లీట్ చేయనున్నారు.
ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న స్పైడర్ మూవీ ట్రైలర్ మహేష్ బర్త్ డే ఆగస్టు 9 న రిలీజ్ చేయడానికి చిత్ర బృందం శ్రమిస్తోంది. ఇంటెలిజన్స్ ఆఫీసర్ గా మహేష్ కనిపించనున్న ఇందులో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్, విలన్ గా ఎస్.జె.సూర్య నటిస్తున్నారు. హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27 న రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















