బాహుబలి 2 రికార్డులను చెరిపేయనున్న మహేష్ బాబు

బాహుబలి కంక్లూజన్ ఐదు రోజుల్లో 700 కోట్లు వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచేసింది. బాలీవుడ్ సినిమాలకు సైతం సాధ్యం కానీ కలక్షన్స్ తెలుగు సినిమా సాధించి ఔరా అనిపించింది. ఈ మార్క్ చేరుకోవాలంటే భారతీయ చిత్రానికి ఇప్పట్లో సాధ్యం కాదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి మహేష్ బాబు ఎలా బాహుబలి రికార్డులను బద్దలు కొడతాడు? అని మీకు అనుమానం రావడంలో తప్పులేదు. ఆ పాయింట్ లోకి వస్తే.. ‘బాహుబలి-2’  ఆంధ్ర రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడులోనూ రికార్డులన్నీ బద్దలు కొట్టింది. కోలీవుడ్‌ స్టార్‌లకు సమానంగా ప్రభాస్‌కు పాపులారిటీ తెచ్చిపెట్టింది.

ఆ రాష్ట్రంలో బాహుబలి కంక్లూజన్ నమోదు చేసిన రికార్డులను బీట్ చేసే శక్తి మహేష్ కి ఉందని చెబుతున్నారు. అతను ఇప్పుడు తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ద్వి భాష చిత్రం స్పైడర్ చేస్తున్నారు. ఈ మూవీపై తెలుగు, తమిళ రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. సో తమిళనాడులో స్పైడర్ బాహుబలి 2 కంటే ఎక్కువ కలక్షన్స్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారి అంచనా నిజమో, కాదో తెలియాలంటే ఆగస్టు 9 వరకు ఆగాల్సింది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus