బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ బాబు చేస్తున్న స్పైడర్ మూవీ ఏప్రిల్ కి థియేటర్ లోకి రావాలి. కానీ వాయిదాలు మీద వాయిదాలు పడి సెప్టెంబర్ 27 న రిలీజ్ కావడానికి ఫిక్స్ అయింది. ఈ రోజు అయినా సినిమా వస్తుందా ? అని మహేష్ ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో విజువల్ ఎఫక్ట్స్, గ్రాఫిక్ వర్క్ చాలా ఎక్కువగా ఉందని సమాచారం. గ్రాఫిక్స్ తో పెట్టుకుంటే ఆలస్యం అవ్వడం సహజం. అందుకే ఈ సందేహం. అటువంటి సందేహాలకు తావు ఇవ్వకుండా ప్రకటించిన తేదీనే రిలీజ్ చేయాలనీ మురుగదాస్ కొత్త ప్లాన్ వేశారు. ఒక సాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ ఎడిటింగ్ పూర్తి చేసుకుంది. డబ్బింగ్ కూడా మొదలయింది. గ్రాఫిక్ వర్క్ జరిగితే రీరీకార్డింగ్, కలర్ కరెక్షన్ వర్క్స్ చేయాల్సి ఉంటుంది.
అందుకే గ్రాఫిక్ వర్క్ ఆలస్యం కాకూడదని ఏకంగా 6 దేశాల్లో స్పైడర్ కు సంబంధించి గ్రాఫిక్స్ పనులు అప్పగించారు. “కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ ఇండియాతో పాటు రష్యా, ఇరాన్, బ్రిటన్ లాంటి పలు దేశాల్లో జరుగుతోంది. సినిమాను హాలీవుడ్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు, అనుకున్న టైమ్ కు సినిమాను కంప్లీట్ చేసేందుకు ఆరు దేశాల్లో సీజీ వర్క్ జరుపుతున్నాం.” అని నిర్మాత ఠాగూర్ మధు వెల్లడించారు. ఏకకాలంలో తెలుగు, భాషల్లో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.