Sree Mukhi: వివాదాస్పదమైన శ్రీముఖి వ్యాఖ్యలు..!

నిజామాబాద్లో జరిగిన ‘సంక్రాంతికి వస్తున్నాం’  (Sankranthiki Vasthunnam) ట్రైలర్ చాలా హాట్ టాపిక్ అయ్యింది. అందుకు ఒక కారణం దిల్ రాజు అయితే ఇంకో కారణం దాన్ని హోస్ట్ చేసిన శ్రీముఖి (Sreemukhi) అని చెప్పాలి. దిల్ రాజు (Dil Raju) స్పీచ్ ఇస్తూ.. “సినిమా అంటే ఆంధ్ర ప్రజలు ఒక వైబ్ తో వస్తారు, కానీ మన తెలంగాణ ప్రజలు వైబ్ అయ్యేది మందు, తెల్ల కళ్ళు చుక్క, మటన్ చూసినప్పుడు మాత్రమే” అంటూ పలికాడు. అతని కామెంట్స్ పై నెటిజన్లు మండిపడ్డారు.

Sree Mukhi

అదే ఈవెంట్లో శ్రీముఖి పలికిన మాటలు కూడా వివాదాస్పదంగా మారాయి అని చెప్పాలి. శ్రీముఖి మాట్లాడుతూ.. ‘రామలక్ష్మణులు అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్. మనం అప్పట్లోనే విన్నాము. కానీ మనం సాక్షాత్తు మన కళ్ళముందే కూర్చున్నారు. ఒకరు దిల్ రాజు అయితే ఇంకొకరు శిరీష్ (Shirish) గారు’ అంటూ శ్రీముఖి పలికింది. ఈ కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి అని చెప్పాలి. ఆమె కామెంట్స్ పై ఇప్పుడు నెటిజన్లు, హిందూ సంఘాల వారు మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు.

‘ఏంటి రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్లా..! నువ్వు చూడని ప్రతీది.. ఫిక్షనల్ అయితే, మీ ముత్తాతని నువ్వు చూశావా? వాళ్ళు కూడా ఫిక్షనలే..! ఒకవేళ కాదు అని చెప్పడానికి.. వాళ్ళ అస్థికలు ఏమైనా నువ్వు జేబులో పెట్టుకొని తిరుగుతున్నావా? ఒకవేళ నీ ముత్తాత ఫిక్షనల్ క్యారెక్టర్ అయితే మరి నువ్వేంటి?’ అంటూ శ్రీముఖిని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus