Sreeleela: శ్రీలీలలోని ప్లస్ పాయింట్ ని వాడుకున్న ‘పుష్ప 2’ టీం!

సుకుమార్ (Sukumar)  సినిమా అంటే కచ్చితంగా ఐటెం సాంగ్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. ఒక్క ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో తప్ప.. సుకుమార్ తీసిన మిగిలిన అన్ని సినిమాల్లోనూ ఐటెం సాంగ్ ఉంటుంది. థియేటర్లలో ఆ పాటలకి మరింత రెస్పాన్స్ వస్తుంటుంది. ‘పుష్ప’ (Pushpa)  లోని ‘ఉ అంటావా ఊఊ అంటావా’ అనే ఐటెం సాంగ్ అయితే దేశవ్యాప్తంగా తెగ ట్రెండ్ అయ్యింది. సమంత ఆ పాటలో చిందులు వేసింది. ఇక ‘పుష్ప 2’  (Pushpa 2) ఐటెం సాంగ్ ఎవరు చేస్తారు?

Sreeleela

అనే చర్చ చాలా కాలం జరిగింది. నోరా ఫతేహి (Nora Fatehi) వంటి బోలెడుమంది గ్లామర్ బ్యూటీస్ పేర్లు వినిపించాయి. ఫైనల్ గా శ్రీలీల (Sreeleela) ఆ పాటకి ఎంపికైంది.ఈమె వల్ల ఇప్పుడు రూ.7 కోట్లు కలిసొచ్చింది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. విషయంలోకి వెళితే.. ‘పుష్ప 2’ లో ఐటెం సాంగ్ కోసం ముందుగా శ్రీలీలని అనుకున్నారట. ఆమె మంచి డాన్సర్. కాబట్టి అల్లు అర్జున్..తో పోటీ పడి డాన్స్ చేయగలదు. కానీ శ్రీలీల వరుస ప్లాపుల్లో ఉండటం వల్ల టీం వద్దనుకుందట.

తర్వాత శ్రద్దా కపూర్ (Shraddha Kapoor) తో ఐటెం సాంగ్ చేయించాలని సుకుమార్ అండ్ టీం భావించింది. కానీ ఆమె ఏకంగా రూ.8 కోట్లు డిమాండ్ చేసిందట. అయినప్పటికీ ‘నార్త్ ప్రమోషన్స్ కి ఉపయోగపడుతుందిలే’ అని ఆమె అడిగినంత ఇవ్వడానికి ‘మైత్రి’ వారు రెడీ అయిపోయారు. కానీ ‘పుష్ప 2’ కి నార్త్ లో కావాల్సినంత క్రేజ్ ఉంది.

అప్పుడు శ్రద్ధాకపూర్ ఎందుకు? అని సర్దిచెప్పి.. కోటి రూపాయలు ఇచ్చి శ్రీలీలతో చేయించాడట’ దర్శకుడు సుకుమార్. ఇప్పుడు శ్రీలీలకి ఎక్కువ ఆఫర్లు లేవు. అయినా ఒక ఐటెం సాంగ్ కోసం శ్రీలీల అంత మొత్తం అనుకుంది అంటే చిన్న విషయం కాదు. అలాగే ఈమె వల్ల ‘మైత్రి’ వారికి రూ.7 కోట్లు మిగిలాయి అని స్పష్టమవుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus