Sreeleela: శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ.. రెమ్యునరేషన్ తక్కువే..!

Ad not loaded.

టాలీవుడ్ లో వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తున్న శ్రీలీల (Sreeleela), ఇప్పుడు బాలీవుడ్ లో అడుగు పెట్టనుంది. ఇప్పటికే పలు తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, కోలీవుడ్ లో కూడా అవకాశాలు సొంతం చేసుకుంది. తాజాగా, హిందీ సినిమాల్లో కూడా ఎంట్రీ ఇస్తూ తన పరిధిని విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఈ పరిణామం ఉత్సాహం పెంచుతున్నప్పటికీ, ఆమె పారితోషికం మాత్రం చర్చనీయాంశంగా మారింది. కార్తీక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కుతున్న ఓ బాలీవుడ్ చిత్రంలో శ్రీలీలకు హీరోయిన్ గా అవకాశం దక్కినట్లు సమాచారం.

Sreeleela

మొదట ఈ సినిమాలో త్రిప్తి డిమ్రీని (Tripti Dimri) తీసుకోవాలని అనుకున్నప్పటికీ, చివరకు శ్రీలీలని ఎంపిక చేశారు. టాలీవుడ్ లో ఆమెకు ఉన్న పాపులారిటీ, డాన్స్ స్కిల్స్, గ్లామర్ అన్ని కలిపి మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇదే ఆమె హిందీ డెబ్యూ కాబట్టి, ఈ ప్రాజెక్ట్‌పై బాగా ఫోకస్ పెట్టిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ సినిమాలో ఆమెకు ఇచ్చే రెమ్యునరేషన్ పై ఇప్పుడు బీటౌన్ లో గట్టిగా చర్చ జరుగుతోంది.

టాలీవుడ్ లో శ్రీలీల ఒక సినిమాకు కనీసం రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తోంది. పుష్ప 2 లో (Pushpa 2: The Rule) కేవలం స్పెషల్ సాంగ్ కోసం ఆమె రూ. 2 కోట్లు అందుకుందట. కానీ, బాలీవుడ్ ఎంట్రీలో మాత్రం కేవలం రూ. 1.75 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు టాక్. హిందీ మార్కెట్ లో మొదటి సినిమా కాబట్టి తక్కువ రెమ్యునరేషన్ కు ఓకే చెప్పిందని అంటున్నారు. ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఆమె, బాలీవుడ్ ఎంట్రీలో ఇంత తక్కువ రెమ్యునరేషన్ కు ఒప్పుకోవడం అవసరమా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

కానీ సినీ వర్గాల మాట ప్రకారం, మొదటి సినిమాతో సక్సెస్ సాధిస్తే వెంటనే ఆమె పారితోషికం రెట్టింపు అవుతుందని, ఆ ఉద్దేశంతోనే శ్రీలీల ఈ ఆఫర్ ను అంగీకరించిందని తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీలీల తెలుగులో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. కోలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. మరి బాలీవుడ్ డెబ్యూ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus