Sreeleela: డీజే టిల్లు సీక్వెల్ పై శ్రీలీల అలా అన్నారా?

2022 సంవత్సరంలోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో డీజే టిల్లు మూవీ ఒకటి. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అంచనాలకు మించి సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో పాటు యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది. డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ పేరుతో సినిమా తెరకెక్కుతుండగా శ్రీలీల ఈ సినిమాను వదులుకున్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. టిల్లు స్క్వేర్ మూవీని వదులుకుని శ్రీలీల తప్పు చేశారని కొంతమంది కామెంట్లు చేశారు.

అయితే ఈ కామెంట్లు తన దృష్టికి కూడా రావడంతో ఈ కామెంట్ల గురించి శ్రీలీల స్పందించి స్పష్టతనిచ్చారు. ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న శ్రీలీల టిల్లు స్క్వేర్ మూవీలో తనకు ఛాన్స్ వచ్చినట్టు తాను షూటింగ్ లో పాల్గొని ఆ తర్వాత ఈ సినిమాను వదులుకున్నట్టు జరిగిన ప్రచారంలో నిజం లేదని తెలిపారు. తనకు ఈ సినిమాలో ఆఫర్ రాలేదని ఆమె చెప్పుకొచ్చారు. ఏదైనా కొత్త సినిమాకు ఎంపిక అయితే సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేస్తానని శ్రీలీల చెప్పుకొచ్చారు.

తన నుంచి వచ్చిన సినిమా ప్రకటనలను మాత్రమే నమ్మాలని ఆమె కామెంట్లు చేశారు. మరోవైపు శ్రీలీలకు వరుసగా సినిమా ఆఫర్లు ఇవ్వడానికి దర్శకనిర్మాతలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. శ్రీలీలకు స్టార్ హీరోలకు జోడీగా కూడా ఆఫర్లు వస్తున్నాయి. అయితే శ్రీలీల భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా శ్రీలీలకు ఆఫర్లు వస్తున్నాయి.

కృతి శెట్టికి ఆఫర్లు అంతకంతకూ తగ్గుతుండగా శ్రీలీల మాత్రం క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. 2023 సంవత్సరం హీరోయిన్లకు ఏ స్థాయిలో కలిసొస్తుందో చూడాల్సి ఉంది. కొత్త ఏడాది సక్సెస్ ట్రాక్ లోకి రావాలని చాలామంది హీరోయిన్లు భావిస్తున్నారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus