Sreeleela, Kriti Shetty: శ్రీలీల వల్లే కృతిశెట్టికి ఇబ్బందులు ఎదురవుతున్నాయా?

ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కృతిశెట్టి పేరు మారుమ్రోగింది. స్టార్ హీరోలు సైతం కృతిశెట్టి తమకు జోడీగా నటిస్తే తమ సినిమాలు కచ్చితంగా హిట్టవుతాయని భావించారు. కొంతమంది నిర్మాతలు కృతిశెట్టికి రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని కూడా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వరుస ఫ్లాపులు కృతిశెట్టి కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపాయి. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం ఫ్లాపులతో కృతిశెట్టితో సినిమా తెరకెక్కించాలంటే దర్శకనిర్మాతలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

కృతిశెట్టి ప్రస్తుతం సినిమా ఆఫర్లు సైతం తగ్గాయి. అయితే కృతిశెట్టికి సినిమా ఆఫర్లు తగ్గడానికి ఒక విధంగా శ్రీలీల కూడా కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి. శ్రీలీల నటించింది రెండు సినిమాలే అయినా ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి. శ్రీలీల డ్యాన్స్ కు యూత్ ఫిదా అయ్యారు. శ్రీలీల ప్రస్తుతం వరుస సినీ ఆఫర్లతో బిజీ అవుతున్నారు. కృతిశెట్టికి వరుస ఫ్లాపుల నేపథ్యంలో ప్రస్తుతం యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు సైతం శ్రీలీలకు ఆఫర్లు ఇవ్వాలని భావిస్తున్నారు,

శ్రీలీల నుంచి పోటీ లేకపోతే కృతిశెట్టి కెరీర్ ఈ స్థాయిలో డౌన్ అయ్యేది కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కృతిశెట్టి కొత్త సినిమాల ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలలో నటించడానికి కృతిశెట్టి ప్రాధాన్యతనివ్వాలని, కథల ఎంపికలో జరుగుతున్న పొరపాట్లను సరిదిద్దుకోవాలని, అభినయ ప్రధాన పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఈ జాగ్రత్తలు తీసుకుంటే కెరీర్ పుంజుకుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కృతిశెట్టి 2023లో ఎలాంటి ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాల్సి ఉంది. కెరీర్ విషయంలో పొరపాట్లు జరగకుండా కృతిశెట్టి ఏం చేయబోతున్నారో చూడాల్సి ఉంది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus