Sreeleela, Balakrishna: బాలయ్యను చూడగానే భయం వేసింది: శ్రీలీల

శ్రీ లీల ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటిగా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె త్వరలోనే బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా శ్రీ లీల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని బాలకృష్ణ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమా కథ చాలా బాగా నచ్చింది. గ్లామర్‌ క్యారెక్టర్స్‌ ఎప్పుడైనా చెయ్యొచ్చు. కానీ, ఒక ఎమోషన్‌ ఉంటూ నటనకు ప్రాధాన్యం ఉన్న ఇలాంటి క్యారెక్టర్స్‌ చాలా అరుదుగా దొరుకుతాయని ఈమె తెలియచేశారు. ఈ సినిమాలు తాను బాలకృష్ణ కూతురిగా నటించడం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని తెలియజేశారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ గారు నటిస్తున్నారని తెలిసి మొదట్లో కాస్త భయపడ్డాను కానీ, బాలయ్య గారిని కలిసిన తర్వాత చాలా ఫ్రీగా ఉన్నానని తెలియజేశారు.

ఎందుకంటే బాలయ్య గారి మనస్తత్వం చాలా చిన్నపిల్లల మనస్తత్వం అని ఆమె తెలిపారు. ఈ సినిమాలో నేను చేసిన మొదటి షాట్‌.. మీరు ట్రైలర్‌లో చూసిన ట్రైనింగ్‌ షాట్‌. పుష్‌అప్స్‌ చెయ్యాలి. కానీ, నేను చేయలేకపోతే బాలకృష్ణగారు బలవంతంగా చేయించారు. ఈ షాట్ పూర్తి కాగానే బాలకృష్ణ గారు మీకు నిజంగానే పుష్అప్స్ చేయడం రాదా అంటూ నన్ను ప్రశ్నించారు అయితే డైరెక్టర్ గారే అలా చేయమన్నారని తాను చెప్పానని శ్రీ లీల వెల్లడించారు.

ఇక ఆయనకు సినిమా రంగంలో చాలా పరిజ్ఞానం ఉందని కేవలం సినిమా రంగం అని మాత్రమే కాదు ఇతర రంగాలలో కూడా తనకు ఎంతో పరిజ్ఞానం ఉందని ఈమె తెలియజేశారు తాను మెడిసిన్ ఎగ్జామ్స్ రాసి షూటింగ్ లొకేషన్లో పాల్గొన్నాను. అయితే మెడిసిన్ లో వచ్చే చాప్టర్స్ గురించి తనతో చాలా బాగా డిస్కస్ చేశారని అప్పుడు నేను మెడిసిన్ చదవకపోయినా ఇంత బాగా ఎలా తెలుసు అంటూ బాలకృష్ణ గారిని చూసి ఆశ్చర్యపోయానని శ్రీ లీల (Sreeleela) తెలిపారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus