Sreeleela: వామ్మో షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తే శ్రీలీల అంత తీసుకుంటుందా..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం యంగ్ హీరోయిన్ శ్రీలీల జపం ఏ రేంజ్ లో చేస్తుందో మన అందరికీ తెలిసిందే. నిన్న గాక మొన్న ఇండస్ట్రీ కి వచ్చినట్టు అనిపిస్తున్న ఈమె చేతిలో ఇప్పుడు ఏకంగా 12 సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది ఈమె నటించిన మూడు సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి. వచ్చే ఏడాది విడుదలయ్యే క్రేజ్ మూవీస్ అన్నిట్లో శ్రీలీల ఉండబోతుంది. ఇండస్ట్రీ కి వచ్చిన రెండేళ్లలో ఈ స్థాయి డిమాండ్ ని రప్పించుకున్న హీరోయిన్ ఎక్కడ లేదు అని చెప్పొచ్చు.

డిమాండ్ కి తగ్గట్టుగానే అమ్మడు రెమ్యూనరేషన్ విషయం లో కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఆమె ఒక్కో సినిమాకి మూడు నుండి 5 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటుంది. ఇక మీదట సంతకం చెయ్యబొయ్యే ప్రాజెక్ట్స్ కి 7 కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వాలట. ఈ రేంజ్ రెమ్యూనరేషన్ సమంత, తమన్నా వంటి వారు కూడా డిమాండ్ చెయ్యడం లేదు. ఇది ఇలా ఉండగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి ఈ కుర్ర హీరోయిన్ ఛార్జ్ చేస్తున్న రెమ్యూనరేషన్ ని చూసి నోరెళ్లబెడుతున్నారు ట్రేడ్ పండితులు.

అందుతున్న సమాచారం ప్రకారం ఈమె షాపింగ్ మాల్ కి వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఉంటె పది లక్షల రూపాయిలు ఇవ్వాలట. అలా ఎన్ని ఎన్ని నిముషాలు ఉంటే అన్ని 10 లక్షలు అన్నమాట. దీనితో పాటు ఆమె ఫ్లైట్ ఖర్చులు, భోజనం ఖర్చులు, హోటల్ బిల్స్ ఇలా అన్నీ కూడా సదరు షాపింగ్ మాల్ కి సంబంధించిన యాజమాన్యమే భరించాలట. ఆమెతో పాటు వచ్చే స్టాఫ్ ఖర్చులు కూడా వాళ్ళవే.

మరి శ్రీలీల (Sreeleela) అంటే కుర్రాళ్లు ఎగబడుతున్నారు మరీ, ఆ రేంజ్ లో డిమాండ్ చెయ్యడం లో తప్పు లేదని అంటున్నారు నెటిజెన్స్. అంతే కాదు ఈమె చేత షాపింగ్ మాల్ ఓపెన్ చేయించబడితే ఆ షాపింగ్ మాల్ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోతుంది అనే నమ్మకం ఉంది కాబట్టే శ్రీలీల ఎంత డిమాండ్ చేసినా వాళ్ళు వెనకడుగు వెయ్యడం లేదని అంటున్నారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus