Sreeleela: అనుష్క కాదు.. జేజెమ్మ శ్రీలీల అట.. వర్కౌట్ అవుతుందా?

2009 లో వచ్చిన ‘అరుంధతి’ సినిమా క్రియేట్ చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా.. అనేక కారణాల వల్ల డిలే అవుతూ 2009 జనవరి 16న రిలీజ్ అయ్యింది. అది కూడా ప్రింట్లు డిలే అవ్వడం వల్ల జనవరి 15న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. ఒకరోజు ఆలస్యంగా రిలీజ్ అయ్యింది. సినిమాపై కూడా మొదట పెద్దగా అంచనాలు లేవు. మొదటి రోజు సంక్రాంతి పండుగ కారణంగా సాదా సీదా ఓపెనింగ్సే వచ్చాయి.

Sreeleela

కానీ మౌత్ టాక్ వల్ల రెండో రోజు నుండి ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. బాక్సాఫీస్ వద్ద అసాధారణమైన విజయాన్ని సొంతం చేసుకుంది ‘అరుంధతి’. తెలుగు సినిమాల్లో రూ.40 షేర్ వసూల్ చేసిన మొట్ట మొదటి సినిమా ఇదే. పైగా లేడీ ఓరియెంటెడ్ సినిమా ఈ రేంజ్లో కలెక్ట్ చేస్తుంది అని ఎవ్వరూ ఊహించలేదు. అలాంటి ఓ ట్రెండ్ సెట్టింగ్ మూవీని దాదాపు 16 ఏళ్ళ తర్వాత హిందీలో రీమేక్ చేసేందుకు రెడీ అయ్యారు నిర్మాత అల్లు అరవింద్.

ఆయన హిందీలో ఏ సినిమా చేయాలన్నా.. తెలుగులో హిట్ అయిన సినిమానే రీమేక్ గా తీస్తుంటారు. కానీ ‘అరుంధతి’ సినిమాకి ఉన్న ప్లస్సులు వంటివి అంచనా వేయకుండా తీస్తే మొదటికే మోసం వస్తుంది. వాస్తవానికి ఆ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అంటే అనుష్క. జేజెమ్మ పాత్రకి ఆమె కరెక్ట్ గా సెట్ అయ్యింది. ఆ లుక్లో కూడా చాలా పవర్ఫుల్ గా కనిపించింది. కానీ రీమేక్ కోసం శ్రీలీలని తీసుకుంటున్నారట. అనుష్క రేంజ్ కటౌట్ శ్రీలీలకి లేదు.

అలాంటప్పుడు ఆ ఆరా అనేది మిస్ అవుతుంది. అలాగే సోనూ సూద్ విలనిజం, బొమ్మాలి రవిశంకర్ వాయిస్ ఓవర్ అనేది ‘అరుంధతి’ కి ఉన్న మరో ప్లస్ పాయింట్స్. అయితే సోనూ సూద్ కారణంగా హిందీ డబ్బింగ్ రైట్స్ మంచి రేటుకి అమ్ముడయ్యాయి. తర్వాత ఆ సినిమాని హిందీ జనాలు టీవీల్లో టెలికాస్ట్ అయిన ప్రతిసారీ తెగ చూసేశారు. అలాంటప్పుడు ఇన్నేళ్ల తర్వాత హిందీలో రీమేక్ చేస్తే అక్కడి జనాలు చూస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఆయన కోసం రవితేజ వెనక్కి.. రవితేజ కోసం ఈయన వెనక్కి.. బాగుంది కదా ప్రేమ!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus