Sreeleela: దెబ్బకు ఆ హీరోతో సినిమాకు ఓకే చెప్పిన శ్రీలీల!

టాలీవుడ్ క్రష్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం అమ్మడి హవా నడుస్తోంది. దాదాపు ముద్దుగుమ్మ చేతిలో డజన్ కు పైగా సినిమాలున్నాయి. చిన్న హీరో దగ్గర్నుండి పెద్ద హీరో వరకు శ్రీలీలే కావాలంటున్నారు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. హీరో తమ రెమ్యునరేషన్ తగ్గించుకుని ఆవిడకు ఇప్పించి మరీ తన సినిమాలో చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇంతకు ముందు ఏ హీరోయిన్ కు ఇంతటి క్రేజ్ రాలేదంటే అతిశయోక్తి కాదు.

అందుకనుగుణంగానే బ్యూటీ విత్ బ్రెయిన్ అయిన శ్రీలీల చాలా తెలివిగా సినిమాలను ఒప్పేసుకుంటుంది. ఈ మధ్యకాలంలో శ్రీలీల కి సంబంధించిన ఏ చిన్న వార్తయినా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక సినిమా తర్వాత మరొక సినిమాను హీరోలంతా ఆమెతోనే కమిట్ అవుతూ క్రేజీ ఆఫర్లు అమ్మడికి కట్టబెడుతున్నారు. వారందరిలోనూ నేనున్నానంటూ అల్లు అర్జున్ కూడా చేరిపోయారు. అల్లు అర్జున్ సైతం శ్రీలీల తో సినిమా చేయాలని తహతహలాడుతున్నాడట.

పుష్ప సినిమా తర్వాత ఆయన నటించబోయే.. త్రివిక్రమ్ సినిమా లో హీరోయిన్ గా ఆమెను సెలక్ట్ చేసుకున్నాడట బన్నీ. అయితే ఆమె కాల్ షీట్లు ఖాళీగా లేవంటూ ఆ ఆఫర్ రిజెక్ట్ చేసిందట. దీంతో ఫుల్ కోపంలో అల్లు అర్జున్ అమ్మడికి సరదగానే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట. అమ్మడుకి సరదగా ఫోన్ చేసి.. “ఇండస్ట్రీలో అవకాశాలు చెప్పి రావు .. వచ్చిన అవకాశాలను మనం యుటిలైజ్ చేసుకోకపోతే.. కెరీర్లో మళ్లీ మళ్లీ ఆ దేవుడు మనకు ఛాన్స్ ఇవ్వడు.

ఇచ్చిన అవకాశాన్ని మనం లాస్ట్ ఛాన్స్ గా తీసుకొని వాడుకోవాలి.. గుర్తుపెట్టుకో.. నీకు ఫ్యూచర్లో పనికొస్తుంది’’ అంటూ శ్రీలీలకు పరోక్షంగా నీకు భవిష్యతులో నా సినిమాలో ఛాన్స్ ఇవ్వననే అర్థంలో చెప్పాడట. దీంతో శ్రీలీల (Sreeleela) దెబ్బకు గప్ చుప్ అయి.. వెంటనే త్రివిక్రమ్ కు కాల్ చేసి సినిమాకు ఓకే చేసిందట.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus