Balakrishna, Sreeleela: బాలయ్య మూవీలో శ్రీలీలకు ఛాన్స్.. ఆ పాత్రలో?

రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లిసందD సినిమాతో ఓవర్ నైట్ లో శ్రీలీల పాపులారిటీని సంపాదించుకున్నారు. సినిమాలో డ్యాన్సులు అద్భుతంగా చేయడంతో పాటు క్యూట్ ఎక్స్ ప్రెషన్లతో శ్రీలీల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పెళ్లిసందD సక్సెస్ సాధించడంతో శ్రీలీలకు తెలుగులో వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. తొలి సినిమాకు తీసుకున్న మొత్తంతో పోలిస్తే ఈ బ్యూటీ రెమ్యునరేషన్ ను కూడా పెంచారని సమాచారం. అయితే బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో శ్రీలీల కీలక పాత్రకు ఎంపికయ్యారని తెలుస్తోంది.

Click Here To Watch

బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. టాలెంట్ ఉన్న హీరోయిన్ బాలయ్య కూతురి పాత్రలో నటిస్తున్నారనే వార్త వల్ల ఈ సినిమాపై అంచనాలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. మరోవైపు బాలయ్య సైతం వయస్సుకు తగిన పాత్రలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు శ్రీలీల 75 లక్షల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. శ్రీలీల ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే మాత్రం ఈమె స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరే అవకాశం ఉంటుంది.

అనిల్ రావిపూడి బాలయ్య కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని మాస్ ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు పుష్కలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. బాలయ్య సినిమాలో నటించడానికి శ్రీలీల కూడా ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి, ఈ సినిమాలో శ్రీలీల నటించడం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బాలయ్య ఒకవైపు గోపీచంద్ మలినేని సినిమాలో నటిస్తూనే మరోవైపు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కూడా నటించనున్నారని తెలుస్తోంది.

అఖండ సక్సెస్ తర్వాత బాలయ్య కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి ప్రస్తుతం సక్సెస్ లో ఉన్న సంగతి తెలిసిందే. బాలయ్య తర్వాత సినిమాలతో కూడా బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus