నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 3’ విజయవంతంగా రన్ అవుతుంది. ఇదిలా ఉండగా ఇటీవల శ్రీముఖి రాహుల్ పై చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. విషయంలోకి వెళితే.. హౌస్ లో ఒకసారి ‘బ్లాక్ షీప్’ అంటూ రాహుల్ ను కామెంట్ చేసింది శ్రీముఖి. ‘వర్ణ వివక్ష కామెంట్స్ చేసింది… జాతి వివక్ష.. కామెంట్స్ చేసిందని కొన్ని కథనాలు పుట్టుకొచ్చాయి. ఇక తన సోదరి ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు ఇలా కుట్ర పన్నుతున్నారంటూ శ్రీముఖి సోదరుడు శుష్రుత్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.
ఇటీవల బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో సదరు ‘మీడియా సంస్థ’ పై అలాగే శ్రీముఖిపై అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్న వారిపై కంప్లైంట్ ఇచ్చాడు. శుష్రుత్ కంప్లైంట్ ను స్వీకరించిన పోలీసులు విచారణ మొదలు పెట్టారట. ‘మొదట ఆ వార్తలను లైట్ తీసుకున్నామని.. కాని వారు పదే పదే శ్రీముఖి ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా వార్తలు రాస్తుండటంతో ఇలా కంప్లైంట్ ఇస్తున్నానని కంప్లైంట్ లో పేర్కొన్నాడట.