‘ఓ మై గాడ్.. సో సెక్సీ ..’ అంటూ వీడియోతో సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి

క్యాస్టింగ్‌ కౌచ్ గురించి మాట్లాడిన హీరోయిన్స్ మొత్తం ఒకవైపు… శ్రీరెడ్డి ఒక వైపు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈమె న్యూస్ ఛానల్స్ డిబేట్ లో నానా రచ్చ చేసింది. ప్రముఖ నిర్మాత తనయుడిని ఈ వివాదంలోకి వార్తల్లోకెక్కింది. పవన్ కళ్యాణ్ ని విమర్శించి అతని అభిమానుల ఆగ్రహానికి గురైంది. ఇక్కడ నటీనటులపై ఆరోపణనలు చేయడం ఆపి.. కోలీవుడ్ పై గురిపెట్టింది. అక్కడి ఇండస్ట్రీ పెద్దలు సైతం శ్రీరెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా నిత్యం వార్తల్లో ఉండే శ్రీ రెడ్డి ఈరోజు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఇది కూడా ఆమె చేసిన ఘన కార్యం వల్ల కాదు. వేరొకరు చేసిన కికి ఛాలెంజ్‌కు సంబంధించిన ఓ వీడియోని పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది. మన దేశంలో కికి ఛాలెంజ్‌ ని బ్యాన్ చేశారు. విదేశాల్లో మాత్రం ఈ ఛాలెంజ్ కొనసాగుతోంది.

అక్కడ ఓ బ్యూటీ ఈ వీడియోని చాలా గ్లామరస్ గా చేసింది. ఆమె అచ్చుగుద్దినట్టు శ్రీ రెడ్డి లా ఉండడం ఇక్కడ కొసమెరుపు. అందుకే ఆ వీడియోని శ్రీ రెడ్డి పోస్ట్ చేస్తూ “ఓ మై గాడ్.. సో సెక్సీ ..” అంటూ కామెంట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎవరోగానీ ఫారెన్ బ్యూటీ ఆకర్షనీయంగా డాన్స్ చేసిందని నెటిజన్లు అభినందిస్తున్నారు. కొంతమంది మాత్రం ఇలాంటి వీడియోని చేయమని శ్రీ రెడ్డి ని అడుగుతున్నారు. కొంపదీసి చేస్తుందా ఏంటి ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus