చిన్న సినిమాల్లో చిన్న పాత్రలు వేసుకునే శ్రీ రెడ్డి .. క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన కామెంట్స్ చేయడంతో వార్తల్లో వ్యక్తిగా మారిపోయింది. మీడియా చుట్టూ ముట్టడంతో.. ఆమె మాటలకూ .. చేష్టలకు హద్దులు లేకుండా పోయాయి. పైగా సోషల్ మీడియాలో రోజుకొకరిపై ఆరోపణలు చేస్తుండడంతో సదరు వ్యక్తులు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. దీంతో లాభం లేదనుకున్న శ్రీ రెడ్డి కోలీవుడ్ సినీ స్టార్స్ పై ఆరోణలు చేసింది. ఆధారాలు లేకుండా ఆరోపిస్తుండడంతో చీవాట్లు తినింది. ఎలాగైతేనేమి మీడియా ద్వారా మంచి అవకాశాన్ని అందుకుంది. చిన్న రోల్ కాదు.. లీడ్ రోల్ నే పట్టేసింది. ఆమె జీవితంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా చిన్న సైజ్ బయోపిక్ రూపుదిద్దుకుంటోంది. ఈ వివరాలను చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీరెడ్డి వెల్లడించింది.
“క్యాస్టింగ్ కౌచ్ పై నేను చేసిన సమరాన్ని వెండితెరపై చూపించబోతున్నాము. నిజ జీవితంలోని సంఘటనల ఆధారంగా చేస్తున్న ఈ సినిమాకి “రెడ్డి డైరీ” అనే పేరును ఖరారు చేశాం. ఇందుకు అల్లావుద్దీన్ దర్శకత్వం వహిస్తారు” అని వివరించింది. “నాకు అవకాశం ఇస్తానని, నన్ను మోసగించినవారికి సంబంధించిన వీడియో ఆధారాలు నా వద్ద ఉన్నాయి. వాటిని సినిమాలో చూపిస్తాను. మా సినిమాకు సహకరిస్తామని నడిగర్ సంగం హామీ ఇచ్చింది” అని శ్రీ రెడ్డి స్పష్టం చేసింది. మరి ఈ మూవీ ఎన్ని వివాదాలకు కేంద్ర బిందువవుతుందో చూడాలి.