బిగ్ బాస్ హౌస్ లో ఆఖరి ఘట్టానికి తెరలేచింది. బుధవారం రాత్రి వరకూ ఓటింగ్ ని పరిగణలోకి తీసుకుని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయబోతున్నామని ముందుగానే చెప్పింది బిగ్ బాస్ టీమ్. హోస్ట్ నాగార్జున ఆదివారం ఇనయా ఎలిమినేషన్ తర్వాత ఈవిషయాన్ని ప్రేక్షకులకి చెప్పాడు. అంతా మీ చేతుల్లోనే ఉంటుందని, మీరు వేసే ఓట్లు మాత్రమే లెక్కలోకి తీసుకుంటామని అన్నాడు. కానీ, ఇనయా ఎలిమినేషన్ ని సోషల్ మీడియా మొత్తం వ్యతిరేఖించింది. ఈవిషయం పక్కనబెడితే, ఇప్పుడు హౌస్ మేట్స్ ఆరుగురులో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఇంట్రస్టింగ్ గా మారింది. అన్ అఫీషియల్ ఓటింగ్ ని ఒక్కసారి గమనించినట్లయితే.,
రేవంత్ టాప్ లో దూసుకుపోతున్నాడు. విన్నర్ గా విజయకేతనం ఎగరవేయడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. ఆ తర్వాత శ్రీహాన్ కూడా రేవంత్ కి గట్టి పోటీ ఇచ్చేలాగానే కనిపిస్తున్నాడు. వీరిద్దరూ అయితే సేఫ్ గానే ఉన్నారు. ఆ తర్వాత రోహిత్ కూడా కొంచెం బెటర్ పర్సెంటేజ్ తో సేఫ్ గానే ఉన్నాడు. ఇక మిగిలిన ముగ్గురులోనే ఎలిమినేషన్ అనేది జరగబోతోంది. షాకింగ్ ఏంటంటే, ఈవిషయం హౌస్ లో ఎవరికీ తెలీదు. వాళ్లకి తెలియకుండా ఇది ఆడియన్స్ కి మాత్రమే చెప్పారు. దీంతో ఇప్పుడు హౌస్ మేట్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆసక్తికరం.
కీర్తి, శ్రీసత్య, ఆదిరెడ్డి ఈ ముగ్గురులో ఓటింగ్ ని ఒక్కసారి చూసినట్లయితే, కీర్తి సేఫ్ జోన్ లోనే కనిపిస్తోంది. ఆ తర్వాత ఆదిరెడ్డి కూడా కొద్దిగా బెటర్ గానే ఉన్నాడు. మిడ్ వీక్ ఓటింగ్ ప్రకారం అయితే శ్రీసత్య హౌస్ నుంచీ ఎలిమినేట్ అవ్వాలి. కానీ, మేల్ కంటెస్టెంట్ ని హౌస్ నుంచీ పంపించేద్దామని లెక్కలు వేస్తే మాత్రం ఆదిరెడ్డి ఎలిమినేట్ అవ్వక తప్పదనే అంటున్నారు. ప్రస్తుతం అన్ అఫీషియల్ ఓటింగ్ లెక్కలు చూస్తుంటే మాత్రం శ్రీసత్యకే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.